
బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణం. ఇప్పటికే ఈ ఇతిహాసం పై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సీతమ్మగా సాయిపల్లవి నటిస్తుంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. అలాగే సహ నిర్మాతగాకన్నడ స్టార్ హీరో యష్ వ్యవహరిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు. రామాయణం సినిమా నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.
రామాయణం సినిమా టీజర్ ను విడుదల చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణ గ్లింప్స్ విడుదల చేశారు. గ్లింప్స్ అద్భుతంగా ఉంది. రాముడిగా రణబీర్ కపూర్ అదరగొట్టారు. రాముడిగా రణబీర్ సరిగా సూట్ అయ్యాడు. అలాగే సాయి పల్లవి సీతగా కనిపించింది. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా అనిపించాయి. విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
హాలీవుడ్ సంస్థ డీఎన్‌ఈజీ వీయఫ్‌ఎక్స్ ఈ సినిమాకు గ్రాఫిక్స్ డిజైన్ చేశారు. అవర్ ట్రూత్.. అవర్ హిస్టరీ అంటూ పరిచయం చేస్తూ గ్లింప్స్ ను వుదూడల చేశారు. ఈ ఏడాది దీపావళికి విడుదలకానుంది రామాయణ 1. ఈ సినిమాను రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ వీడియో గ్లింప్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.