టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని చివరిగా డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు రామ్ నెక్ట్స్ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రామ్ ఎవరితో సినిమా చేస్తారా.? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో రామ్ తన కొత్త సినిమాను ప్రారంభించారు. రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ రాపో 22ను ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది.
#RAPO22 హీరోయిన్గా యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది. మొదటి సినిమాతో గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది. వాళ్ళిద్దరి పెయిర్, సీన్స్ సినిమా హైలైట్స్‌లో ఒకటి అవుతాయని యూనిట్ అంటోంది.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో దర్శకుడు మహేష్ బాబు. పి సున్నితమైన వినోదంతో పాటు చక్కటి సందేశం ఇచ్చారు. భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించారు. ఈ సినిమానూ యూత్, ఫ్యామిలీ, ఆడియన్స్ అందరూ మెచ్చే కథతో తెరకెక్కించనున్నారు. నవంబర్ 21న పూజ జరిగిన తర్వాత ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాతో రామ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమాతో ఉస్తాద్ రామ్ తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..