వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కాదు.. ప్రతి విషయంలో తన స్టైల్లో ఓపెన్ కామెంట్స్ చేస్తూ.. పలు కాంట్రావర్సీలకు దారి తీస్తుంటారు. ఇటీవల కరోనా వైరస్.. లాక్ డౌన్.. ప్రభుత్వాల పై కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆర్జీవితో అరియానా చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకనొక సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే ఇందులో వర్మ, అరియానాలు ఎవ్వరూ కూడా వెనక్కి తగ్గలేదు. ఈ చిట్ చాట్ కాస్తా చిలికిచిలికి గాలివానలా మారడంతో.. వర్మ, అరియానాలు పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మను టీవీ9 ఇంటర్వ్యూ చేసింది.
ఆర్జీవితో జరిగిన ఇంటర్వ్యూలో టీవీ9 న్యూస్ రీడర్ రజినీ కాంత్ అడిగిన ప్రశ్నలకు మరోసారి తన స్టైల్లో సమాధానాలు చెప్పారు. ఒక వేళ రామ్ గోపాల్ వర్మ పీఎం లేదా సీఎం అయితే ఏం చేస్తారు అని ప్రశ్నించగా.. పోర్న్ లీగలైజ్ చేస్తా అంటూ మరోసారి తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు వర్మ. మిగతా పనులు వేరు వేరు డిపార్ట్ మెంట్స్ చేస్తాయని.. తను మాత్రం అదొక్కటే చేస్తానని చెప్పారు. ఇప్పుడు చేస్తున్న సేమి పోర్న్ సినిమాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. ఇంకా డిఫరెంట్ గా చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ట్వీట్..
వీడియో..
Also Read: Minister Puvvada Ajay: ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరోలా.. బీజేపీ తీరును తూర్పారబట్టిన మంత్రి పువ్వాడ..
Heath Tips: సరైన నిద్ర లేకపోతే చనిపోయే ప్రమాదం ఎక్కువే.. అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు…
Hariteja: ముఖం చూపించకుండానే పాప పేరెంటో చెప్పిన హరితేజ.. ఇంతకీ ఏం పేరు పెట్టిందో తెలుసా..