అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు.. ఒకప్పుడు క్లాసిక్, ట్రెండ్ సెట్టర్ మూవీస్ తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన ఆర్జీవీ.. ఇప్పుడు అంతగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు

అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ
Ram Gopal Varma

Updated on: Jan 16, 2026 | 12:14 PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు ఆర్జీవీ. గతంలో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ.. ఆ తర్వాత ఆయన స్టైల్ మార్చారు. కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు వర్మ.. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు ఆర్జీవీ. దాంతో ఆయన ఎలాంటి సినిమాతో వస్తారా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా రామ్ గోపాల్ వర్మ కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గతంలో ఆర్జీవీ తన కుమార్తె పెళ్లి గురించి ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. దాని గురుంచి యాంకర్ అడగ్గా.. ఎవరైనా పర్ఫెక్ట్ గా ఉంటే తనకు బోర్ కొడుతుందని అన్నారు వర్మ. నా కూతురు అల్లుడు పర్ఫెక్ట్ కపుల్.. అందుకే వాళ్లు నాకు ఎప్పుడు బోర్ కొడతారు.. వాళ్ళ మధ్యన ఏం ప్రాబ్లం లేకపోతే ఇంకేముంటుంది.? అని అన్నారు వర్మ. ప్రేమలో పడి, పెళ్లి చేసుకొని, పిల్లలను కని, ప్రతిదీ ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకునే పరిపూర్ణ జీవితాలకు తాను వ్యతిరేకమని  ఆర్జీవీతెలిపారు. ఏదైనా సరే  పర్ఫెక్ట్ గా ఉంటే తనకు బోర్ కొడుతుందని ఆయన చెప్పుకొచ్చారు

సజావుగా వెళ్తున్న జీవితాలు, సజావుగా నడిచే మనుషులు నాకు బోర్ కొడతారు అని అన్నారు. కుమార్తె వివాహ ప్రస్తావన వచ్చినప్పుడు, తన కుమార్తె కాపురం సరిగా ఉండొద్దని తాను కోరుకోవడం లేదని కానీ వాళ్లు నాకు బోర్ కొడతారని అన్నారు. ప్రస్తుతం వారు సంతోషంగా ఉన్నారని, అది ముఖ్యం అని చెప్పారు. అయితే, వారి సంతోషం తనకు బోర్ కొట్టే అంశంగా మారిందని, ఎందుకంటే సమస్యలు లేని జీవితం తనకు ఆసక్తికరంగా ఉండదని అన్నారు. తన అల్లుడి గురించి మాట్లాడుతూ..  ఆయనతో తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు మాట్లాడుకుంటానని, తన అల్లుడు తన జీవితాన్ని జంతువులా చూస్తాడని అన్నారు ఆర్జీవీ. తన అల్లుడికి నటనపై, సినిమాలపై అస్సలు ఆసక్తి లేదని.. తాను తీసే సినిమాలు కానీ, ఇతర తెలుగు లేదా హిందీ సినిమాలు కానీ అతను చూడడని చెప్పుకొచ్చారు వర్మ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..