RGV’s Controversial Statements: ఆయన పేరు ఓ సంచలనం..ఆయన మాట ఓ వివాదం.. ముక్కుసూటి తనం ఆయన నైజం ఆయన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కింగ్ నాగార్జున తో కలిసి వర్మ తెరకెక్కించిన శివ సినిమా టాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేసింది. అసలు సిసలైన మాస్ యాక్షన్ ను ఆడియన్స్ కు రుచిచూపించాడు వర్మ. అలాగే వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉన్నట్టే.. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సినిమాల్లో చూపించడం ఆర్జీవీ స్టైల్. కరోనా లాక్ డౌన్ సమయంలో వర్మ ప్రేక్షకులను తన సినిమాలతో అలరించారు. వరుసగా ఓటీటీ వేదికగా సినిమాలను రిలీజ్ చేశారు ఆర్జీవీ.
ఇక ఆర్జీవీ దగ్గర దర్శకత్వంలో శిష్యరికం చేసిన ఎంతో మంది ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ గా రాణిస్తున్నారు. వర్మను తిట్టేవాళ్ళు ఎంతమందున్న ఆయనను ఇష్టపడేవాళ్లు కూడా అంతే ఉన్నారు. ఆర్జీవీ అంటే ఆయన సినిమాలకంటే ముందు కాంట్రవర్సీలు గుర్తొస్తాయి. సినిమాలను పబ్లిసిటీ చేసుకోవడంలో వర్మ స్టైలే వేరు. అంతే కాదు ఆయన రాజకీయ నాయకుల మీద సినిమా పెద్దల మీద వర్మ చేసే కామెంట్స్ ఎప్పుడు హాట్ టాపిక్స్.. సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా చేసి పెద్ద దుమారాన్నే రేపాడు ఆర్జీవీ. లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించి నిజమైన బయోపిక్ అంటూ కామెంట్లు చేశారు వర్మ. ఆతర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన పైన కూడా వర్మ సినిమా తీసాడు. అలాగే మిర్యాల గూడలో జరిగిన పరువు హత్య నేపథ్యంలోనూ సినిమాను తీసాడు వర్మ. ఇక ఎందరో ఆశావాదులకు రోల్ మోడల్ గా నిలిచే ది గ్రేట్ రామ్‌గోపాల్ వర్మ పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజును కూడా వెరైటీగా పబ్లిసిటీ చేసుకుంటారు వర్మ. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ చూస్తే అది ఇట్టే అర్ధమైపోతుంది. ఈ రోజు నాపుట్టిన రోజు కాదు నేను చనిపోయిన రోజు.. ఎందుకంటే నా జీవితంలో మరో సంవత్సరం ఈ రోజుతో చనిపోయింది” అంటూ రాసుకొచ్చాడు వర్మ.
No , it’s not my birthday but it’s my deathday today because one more year in my life died today ???
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
Most Eligible Bachelor: ఆకట్టుకుంటున్న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సాంగ్