Ram Gopal Varma: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన వర్మ .. భాగ్యనగరంలో మొక్కలు నాటిన ఆర్జీవీ

|

Mar 20, 2022 | 4:43 PM

Ram Gopal Varma: తెలంగాణ లో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన హరితహారం మంచి ఫలితాలనిచ్చింది. మొక్కల పెంపకంలో విషయంలో రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్‌కుమార్ (MP Santosh Kumar) చేప‌ట్టిన గ్రీన్ ఇండియా..

Ram Gopal Varma: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన వర్మ .. భాగ్యనగరంలో మొక్కలు నాటిన ఆర్జీవీ
Ram Gopal Varma
Follow us on

Ram Gopal Varma: తెలంగాణ లో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన హరితహారం మంచి ఫలితాలనిచ్చింది. మొక్కల పెంపకంలో విషయంలో రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్‌కుమార్ (MP Santosh Kumar) చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. సినీ నటీనటులు, రాజకీయ నేతలు నుంచి సామాన్యుల వరకూ ఈ కార్యక్రమంలో భాగమవుతున్నారు. తమ వంతుగా మొక్కలు నాటుతూ.. మరో ముగ్గురుకి ఛాలెంజ్ ను విసురుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green Indian Challenge) కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్‌, యాంక‌ర్ స్వ‌ప్న (Swapna) విసిరిన ఛాలెంజ్‌ను స్వీక‌రించారు.

ఈ రోజు రాంగోపాల్ వ‌ర్మ హైదరాబాద్ లోని శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని పబ్లిక్ పార్కులో స్వప్న తో కలిసి మొక్క‌లు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవీ తో కలిసి మొక్కలు నాటిన ఫోటోలను, వీడియో కూడా స్వప్న సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను రామ్ గోపాల్ వర్మ స్వీకరించడమే కాదు.. ఇప్పుడు మొక్కలు నాటినందుకు థాంక్స్ చెప్పారు.

 

Also Read:

Curry Leaves: కూరలో కరివేపాకు అని తీసిపారేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే

Success Story: ఇంట‌ర్నెట్ అంటే తెలియని 50 ఏళ్ల మహిళ.. ఓ యూట్యూబ్ ఛానెల్ ఓనర్‌.. నెల‌కు 70 వేలు సంపాదన