Chiru Acharya Movie: ‘ఆచార్య’ సిద్ధమవుతున్నాడు.. వైరల్‌గా మారిన చెర్రీ న్యూ లుక్.. ఎర్ర జెండా, తుపాకీ సాక్షిగా..

Ram Charan New Look In Acharya Movie: చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అపజయం..

Chiru Acharya Movie: ‘ఆచార్య’ సిద్ధమవుతున్నాడు.. వైరల్‌గా మారిన చెర్రీ న్యూ లుక్.. ఎర్ర జెండా, తుపాకీ సాక్షిగా..

Updated on: Mar 01, 2021 | 8:47 PM

Ram Charan New Look In Acharya Movie: చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సిమాపై భారీ అంచనాలున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తుండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో చెర్రీ కామ్రేడ్ సిద్ధ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆచార్య సినిమాకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో రామ్ చరణ్ భుజంపై చిరు చేయి వేసినట్లు కనిపిస్తోంది. ఇక చిరు చేతికి ఉన్న ఎర్రటి వస్త్రం, అక్కడే వారికి ఎదురుగా ఉన్న తుపాకీ ఆకట్టుకుంటోంది. దేవాలయాల పరిరక్షణ కోసం పోరాడే చిరుకు అడవిలో కామ్రేడ్‌తో పనేంటన్న ఆసక్తికర ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక ఈ ఫొటోను దర్శకుడు కొరటాల శివ పోస్ట్ చేస్తూ.. ‘ఆచార్య సిద్ధమవుతున్నాడు’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఇక ఇదే ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన చెర్రీ.. ‘ఇది కామ్రేడ్‌ సమయం! ఆచార్య సెట్‌లో నాన్న, కొరటాల శివతో ప్రతిక్షణం ఆనందిస్తున్నా’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా, చెర్రీకి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను మే 13న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Also Read: Celebreties Birthdays In March: మార్చి నెలలో ఎంత మంది సెలబ్రెటీల పుట్టినరోజులున్నాయో తెలుసా..

Wild Dog Movie: హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లే ‘వైల్డ్ డాగ్’కు మూలం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నాగ్..

Sobhan Babu : సినిమా ఇండస్ట్రీలో ఎందరో వందల కోట్లు కూడబెట్టడానికి అసలు కారణం శోభన్ బాబు అని తెలుసా?