Ram Charan: ‘ఆర్ఆర్ఆర్’ సెట్ నుంచి చరణ్ ఫోటోస్ లీక్.. చెర్రీతో అంత క్లోజ్‏గా ఉన్న ఆ బుడ్డోడు ఎవరో ?

Ram Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి జక్కన్న చెక్కుతున్న

Ram Charan: ఆర్ఆర్ఆర్ సెట్ నుంచి చరణ్ ఫోటోస్ లీక్.. చెర్రీతో అంత క్లోజ్‏గా ఉన్న ఆ బుడ్డోడు ఎవరో ?
Ram Charan

Updated on: Jun 29, 2021 | 7:11 PM

Ram Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి జక్కన్న చెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్ డేట్ తెగ ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఇవాళ ఉదయం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అప్ డేట్ తోపాటు.. చెర్రీ, ఎన్టీఆర్ లకు సంబంధించిన ఫోటోను చిత్రయూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడిని ఈ మూవీ షూటింగ్ తిరిగి ఇప్పుడు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది.

అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా పాల్గోంటున్నట్లుగా ఓ ఫోటోను చూస్తే అర్థమవుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుంచి చెర్రి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. అందులో చెర్రీ ఎంతో స్టైలీష్ గా బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపిస్తున్నాడు. అయితే చరణ్ నయా లుక్ తోపాటు.. మరో బుడ్డోడు కూడా అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. చరణ్ పక్కన నిల్చోని.. అంతే స్టైలిష్ గా కనిపించేలా డ్రెస్ అప్ అయ్యి జేబులో చేయి పెట్టుకుని మీ చరణ్ తో మాట్లాడుతూ కనిపించాడు. ఇంకేముంది.. నెటిజన్లు తమ మెదడుకు పని పెట్టారు. చరణ్ పక్కన నిల్చున్న ఆ బుడ్డోడు ఎవరు అయి ఉంటాడు.. అక్కడ తనకు ఏం పని అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ ను ట్యాగ్ చేస్తూ.. ఆ చిన్నోడు భలే ఉన్నాడు ఎవరన్న అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్‌’నూ వదలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్ అంటూ తెగ ట్రోల్ చేసేస్తున్నారు..!

Hyderabad Skin Bank: తెలుగు రాష్ట్రాల్లో తొలి చర్మ బ్యాంకుకు శ్రీకారం.. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్స

Freida Pinto: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయినా హీరోయిన్.. ప్రియుడి ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసిన ఫ్రిదా..