Ram Charan: వ్యాక్సినేషన్‌ సెంచరీపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌…హిస్టారిక్‌ ఫీట్ అని ప్రశంసలు…

కరోనాపై పోరులో భాగంగా భారత్‌ గురువారం ఉదయం నాటికి 100 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ పూర్తి....

Ram Charan: వ్యాక్సినేషన్‌ సెంచరీపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌...హిస్టారిక్‌ ఫీట్ అని ప్రశంసలు...
Ram Charan

Updated on: Oct 23, 2021 | 10:57 AM

కరోనాపై పోరులో భాగంగా భారత్‌ గురువారం ఉదయం నాటికి 100 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తద్వారా చైనా తర్వాత 100 కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్ రికార్డుల్లో కెక్కింది. దీనిపై వివిధ రంగాలకు చెందిన సెలట్రిటీలు తమ స్పందనను తెలియజేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో సినిమా తారలు కూడా ఉన్నారు. 100 కోట్ల టీకా డోసులు పూర్తి చేయడం దేశానికి గర్వకారణమని ఇటీవల పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఈ హిస్టారిక్‌ ఫీట్‌పై స్పందించాడు. ఈ సందర్భంగా కరోనాపై పోరులో కీలకంగా వ్యవహరిస్తోన్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్లను ప్రత్యేకంగా ప్రశంసించాడు.

ప్రంట్‌ లైన్‌ వర్కర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు..
ట్విట్టర్‌ ద్వారా తన స్పందనను తెలియజేసిన రామ్‌ చరణ్‌..’భారత దేశం 100 కోట్ల వ్యాక్సినేషన్లను పూర్తి చేసుకుని ‘వ్యాక్సినేషన్‌ సెంచరీ’ అనే చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకుంది. ఇందుకోసం అహర్నిశలు కృషి చేసిన ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, వైద్య, ఆరోగ్య సిబ్బంది అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని తెలిపాడు. ఈ సందర్భంగా తన ట్వీట్‌కు ‘మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఇండియా’ హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించడం ద్వారా వారిని కూడా అభినందించాడు చరణ్‌.

Also read:

Samantha: నా హృదయంలో వీటికి ప్రత్యేక స్థానముంది….ఎట్టకేలకు నా కల నిజమైంది…

PelliSandaD-Sree Leelaశ్రీలీల నా కూతురు కాదు.. వివాదంలో పెళ్లి సందడి హీరోయిన్.. మరో ట్విస్ట్.. (వీడియో)

Happy Birthday Prabhas: నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫ్యాన్స్