Ram Charan-Prashanth Neel: ఇది కదా మెగా అభిమానులకు అసలైన పండుగ

|

Oct 15, 2021 | 7:10 PM

టాలీవుడ్ నుంచి ఇంట్రస్టింగ్ న్యూస్ వచ్చింది. 'కేజీఎఫ్' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి దేశం దృష్టిని ఆకర్షించి..

Ram Charan-Prashanth Neel: ఇది కదా మెగా అభిమానులకు అసలైన పండుగ
Charan Chiru Prasanth Neel
Follow us on

టాలీవుడ్ నుంచి ఇంట్రస్టింగ్ న్యూస్ వచ్చింది. ‘కేజీఎఫ్’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి దేశం దృష్టిని ఆకర్షించి.. భారీ ఎలివేషన్స్ సీన్స్‌తో హీరోల మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారారు దర్శకుడు ప్రశాంత్ నీల్.  ఆ మూవీకి సీక్వెల్​ తీసిన ఆయన.. ప్రస్తుతం ప్రభాస్​తో యాక్షన్ డ్రామా ‘సలార్’ తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్​తోనూ ఓ సినిమా కమిటయ్యారు. ఇప్పుడు ప్రశాంత్​నీల్.. మెగా పవర్ స్టార్ రామ్​చరణ్, మెగాస్టార్ చిరంజీవిని దసరా పండుగ రోజు కలవడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఈ ఫొటోలను రామ్​చరణ్, ప్రశాంత్​ నీల్.. తమ తమ ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. చరణ్​తో ప్రశాంత్ నీల్​ సినిమా చేయబోతున్నాడని ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరూ చిరు ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీలో కలిసినప్పటికీ, భవిష్యత్తులో ఈ కాంబినేషన్​లో మూవీ చూసే అవకాశమైతే లేకపోలేదు.

‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకులను పలుకరించేందుకు సిద్ధమైన రామ్​చరణ్.. నెక్ట్స్ శంకర్ దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. నవంబరు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ డైరెక్టర్​ గౌతమ్ తిన్ననూరితో కూడా ఓ మూవీ చేయనున్నారు. ఈ ప్రకటన నేడే వచ్చింది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

మరోవైపు యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో జాయిన్ అయిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దాదాపు 35 రోజుల చికిత్స అనంతరం నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేడు సాయి తేజ్ బర్త్ డే కూడా. ఈ క్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా పలువురు కుటుంబ సభ్యులు.. సినీ ప్రముఖులు, అభిమానులకు అతడికి బెస్ట్ విషెస్ తెలిపారు.

Also Read:  రోమాలు నిక్కపొడుచుకునే చిరు స్పీచ్.. పవన్ కళ్యాణ్ భావోద్వేగం.. నెట్టింట వైరల్

షెఫాలీ వర్మ డైరెక్ట్‌ త్రో.. స్టన్ అయిన కామెంటేటర్స్.. ‘లేడీ జడేజా’ అని కామెంట్స్