Ram Charan: గ్లోబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సంచలన దర్శకుడితో రామ్ చరణ్.. అసలు ఊహించని కాంబో

RRR తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ సినిమాతో నటుడిగా మరో మెట్టు పైకెదిగాడన్న ప్రశంసలు అందుకున్నాడు మెగా పవర్ స్టార్. కాగా ఇప్పుడు బాలీవుడ్ కు చెందిన ఓ సంచలన దర్శకుడు రామ్ చరణ్ తో సినిమా తీయనున్నాడని ప్రచారం జరుగుతోంది.

Ram Charan: గ్లోబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ సంచలన దర్శకుడితో రామ్ చరణ్.. అసలు ఊహించని కాంబో
Ram Charan

Updated on: Feb 14, 2025 | 6:18 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ లతో ఆడియెన్స్ ను పలకరించాడు గ్లోబల్ స్టార్. అయితే ఈ రెండు సినిమాలు రామ్ చరణ్ రేంజ్ కాదని అభిమానులు అనుకుంటున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆర్‌ సీ 16 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పుడు రామ్ చరణ్ సినిమాల గురించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. గత ఏడాది జూలైలో విడుదలై సంచలనం సృష్టించిన హిందీ చిత్రం ‘కిల్’. ఆద్యంతం అద్దిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో బాలీవుడ్ ఆడియెన్స్ ను కట్టి పారేశాడు దర్శకుడు నిఖిల్ నగేష్ భట్. ఇప్పుడు అతను రామ్ చరణ్ కు ఒక పౌరాణిక కథ చెప్పగా, గ్లోబల్ స్టార్ కూడా ఆ కథకు అంగీకరించినట్లు తెలుస్తోంది. నిఖిల్ భట్ మొత్తం రామాయణం లేదా మహాభారతం గురించి కాకుండా కేవలం ఒక ముఖ్యమైన సంఘటన గురించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి.

కాగా ఈ మైథలాజికల్ సినిమా తీయడం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడట డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని ప్రీ-విజువల్స్ ఇప్పటికే పూర్తయ్యాయట. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయట. నిఖిల్ నగేష్ భట్ ప్రస్తుతం ‘అపూర్వ’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ థ్రిల్లర్ విడుదలైన తర్వాత ఆయన రామ్ చరణ్ తో సినిమాను తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

‘RRR’ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో, అంతకు ముందు ‘మగధీర’ సినిమాలోనూ మైథలాజికల్ రోల్స్ చేశాడు రామ్ చరణ్. అయితే ఇప్పుడు పూర్తిగా పౌరాణిక కథతో కూడిన చిత్రంలో చెర్రీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్, తదుపరి సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాడు. ఆ తర్వాతే నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో సినిమాలో నటించనున్నాడని తెలుస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .