RamCharan: ఆర్సీ 17 అనౌన్స్‌మెంట్.. క్రియేటివ్ డైరెక్టర్ డైరెక్షన్‌లో మెగాపవర్ స్టార్

పొలిటికల్ డ్రామాగా రానున్న గేమ్ చెంజర్ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని టాక్. అలాగే ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

RamCharan: ఆర్సీ 17 అనౌన్స్‌మెంట్.. క్రియేటివ్ డైరెక్టర్ డైరెక్షన్‌లో మెగాపవర్ స్టార్
Ram Charan

Updated on: Mar 25, 2024 | 6:42 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు చెర్రీ చేతిలో ఉన్న సినిమాలన్నీ బడా సినిమాలే.. ఎప్పటి నుంచో గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ జరుగుతూ వస్తుంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను టాప్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రానున్న గేమ్ చెంజర్ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని టాక్. అలాగే ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమానుంచి క్రేజీ అప్డేట్ రానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన ప్రేమ కథను అందించారు. ఉప్పెన సినిమా వందకోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా కూడా అనౌన్స్ చేశారు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రంగస్థలం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. రంగస్థలం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రానుంది. హోలీ సందర్భంగా సుకుమార్ రామ్ చరణ్ మూవీని అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆర్సీ 17 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రెడీ అవుతుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని క్రేజీ అప్డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.