Ram Charan: బాబాయ్‏తో సినిమా చేయాలని ఉంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ చరణ్..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య (Acharya). ఈ మూవీ ఏప్రిల్ 29న

Ram Charan: బాబాయ్‏తో సినిమా చేయాలని ఉంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రామ్ చరణ్..
Ram Charan

Updated on: Apr 25, 2022 | 6:58 AM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య (Acharya). ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.. ఈ క్రమంలో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య సినిమా ప్రమోషన్స్‏లలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మీడియతో ముచ్చటించారు చరణ్. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏తో సినిమా చేయడం గురించి ప్రస్తావించారు చరణ్.

చరణ్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారితో ఓ సినిమా చేయాలనుకుంటున్నా.. మాకు సరిపడా కథ కోసం చూస్తున్నాం. కథ కుదిరినప్పుడు మా కాంబోలో సినిమా కచ్చితంగా సినిమా ఉంటుంది. ఆ సినిమాను నేను నిర్మిస్తానేమో.. నా బ్యానర్లో మా బాబాయ్ నటించాలని. బాబాయ్ బ్యానర్లో నేను నటించాలని అనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఆచార్య సినిమాను ఇప్పుడే హిందీలో విడుదల చేయాలని ఏమి అనుకోవడం లేదని.. దానికి తగ్గట్లుగా చేయాల్సిన నిర్మాణాంతర పనులు చాలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య వెంట వెంటనే రావడం వలన పనులు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతానికి సినిమాను దక్షిణాదిలో మాత్రమే విడుదల చేస్తున్నాము. కొన్ని రోజుల తర్వాత హిందీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. మంచి కథలు వస్తే బాలీవుడ్ లోనూ సినిమాలు చేయడానికీ సిద్ధమే అని అన్నారు చరణ్.

మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరు, చరణ్ కలిసి నటించిన సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించగా.. సోనూ సూద్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Megastar Chiranjeevi: తెలుగు సినిమా ఇండియన్‌ సినిమా అని గర్వపడేలా చేశారు.. దర్శకధీరుడిపై

మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..

Rajinikanth: ‘బీస్ట్’ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ సినిమా.. రజినీకాంత్ మూవీలో ఆ యంగ్ హీరో కూడా

Prabhas: రాఖీభాయ్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన యంగ్‌ రెబల్‌ స్టార్‌.. యష్‌ ఏం రిప్లై ఇచ్చాడో తెలుసా?

Gangavva: శభాష్ గంగవ్వ.. సొంతూరికి ఆర్టీసీ బస్సు తీసుకొచ్చిన యూట్యూబ్ స్టార్