తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాల్లో రెండు రోజులు పాటు సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో హీరో రామ్ చరణ్ రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కోనసీమ జిల్లా బొబ్బర్లంకలో జరిగే “గేమ్ ఛేంజర్ ” మూవీ షూటింగ్ కోసం రాజమండ్రి చేరుకున్న రామ్ చరణ్ రాత్రికి రాజమండ్రిలోనే బస చేశారు. బొబ్బర్లంకలో శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. మూడు రోజులపాటు జరగనున్న సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొననున్నారు.
రామ్ చరణ్ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో గజ మాలతో ఘన స్వాగతం పరికారు ఫ్యాన్స్. మెగా అభిమానులకు కార్లో నుంచి అందరికీ అభివాదం చేస్తూ రామ్ చరణ్ ముందుకు సాగారు. మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి,కోపల్లి శ్రీను ఇతర అభిమానులు..పుష్పగుచ్చం అందజేసారు.రాజమండ్రి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గన షెల్టన్ హోటల్ కి రామ్ చరణ్ తేజ్ చేరుకున్నారు.
మూడు రోజులు పాటు రాజమండ్రిలోనే రామ్ చరణ్ బస చేయనున్నారు.. బొబ్బర్లంక, ఆత్రేయపురం అందాలను శంకర్ ఈ సినిమాలో చూపించనున్నారు.. రామ్ చరణ్ రెండు రోజులు పాటు షూటింగ్ నిమిత్తం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లనున్నారు.అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాంతో ఆలయానికి వెళ్లే వాహనాల ట్రాఫిక్ ని మళ్ళించారు రావులపాలెం పోలీసులు. రామ్ చరణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.