రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. రాజమహేంద్రవరంలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు. అభిమానుల మృతి వార్తతో ఆవేదన వ్యక్తం చేశారు రామ్ చరణ్ అలాగే ఆర్థిక సాయం కూడా చేశారు. తాజాగా రామ్ చరణ్ అభిమానులు కూడా మృతి చెందిన మెగా అభిమానుల కుటుంబాలకు రూ. 10లక్షల ఆర్థిక సాయం అందించారు. వారికి అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు.