Ram Charan: ఇక మొదలెడదామా.. గేమ్ ఛేంజర్‌గా రామ్ చరణ్.. RC15 టైటిల్ ఇదే..

|

Mar 27, 2023 | 8:36 AM

టైటిల్ రివీల్ చేస్తూ.. విడుదల చేసిన వీడియో చూస్తుంటే.. పూర్తిగా పాలిటిక్స్ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు.

Ram Charan: ఇక మొదలెడదామా.. గేమ్ ఛేంజర్‌గా రామ్ చరణ్.. RC15 టైటిల్ ఇదే..
Global Star Ram Charan's
Follow us on

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం టైటిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈరోజు చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC15 టైటిల్ లోగో వీడియో కాసేపటి క్రితం విడుదల చేస్తూ.. చెర్రీకి బర్త్ డే విషెస్ తెలిపింది చిత్రయూనిట్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ గేమ్ ఛేంజర్ గా ఫిక్స్ చేశారు. టైటిల్ రివీల్ చేస్తూ.. విడుదల చేసిన వీడియో చూస్తుంటే.. పూర్తిగా పాలిటిక్స్ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు.

భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవల్లె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీక్ అయిన పోస్టర్స్ మూవీపై ఆసక్తిని పెంచాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ పుట్టినరోజు సెలబ్రెషన్స్ ఘనంగా జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. తమ అభిమాన హీరోకు వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‏గా క్రేజ్ సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమాతో ప్రపంచస్థాయిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారు. మెగాస్టార్ చిరు తనయుడిగా తన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న మెగా పవర్ స్టార్ చరణ్‏కు టీవీ 9 తెలుగు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.