
పెళ్లి తర్వాత రామ్ చరణ్ పూర్తిగా మారిపోయాడు. నిజంగా ఉపాసన రాకతో చెర్రీ లైఫ్‌లో కొత్త వైబ్స్ ప్రవేశించాయి. ఫోటోగ్రాఫర్‌గా మారిపోవడం మాత్రమే కాదు..మనిషిలో ప్రశాంతత, పెద్దరికం కనిపిస్తున్నాయి. ఇక వైఫ్‌తో కలిపి గ్యాప్ దొరికినప్పుడల్లా ట్రిప్స్‌కు కూడా వెళ్తున్నాడు చెర్రీ. తాజాగా ఈ కపుల్ గోవా వెళ్లారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకున్నారు. మూవీ షూటింగ్‌కి గ్యాప్ ఇచ్చి మరీ శ్రీమతితో కలిసి కొత్త సంవత్సారానికి వెల్‌కమ్ చెప్పాలని మెగా పవర్ స్టార్ డిసైడవ్వడం గొప్ప విషయం అంటున్నారు ఆయన ఫ్యాన్స్. కాగా జనవరి 3న ఈ జంట తిరిగి హైదరాబాద్ రానున్నారు.
ఇక వచ్చినప్పటి నుంచి జక్కన చెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర షూటింగ్‌లో బిజీ అవ్వనున్నాడు చరణ్. ప్రస్తుతం చరణ్ నటుడిగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ నటించిన ‘సైరా’ను నిర్మించిన చరణ్..ఆయన 152వ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు.