AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: అచ్చం తండ్రిలాగే మెగా ప్రిన్సెస్.. మొదటిసారి క్లీంకార ఫేస్ రివీల్.. ఎంత క్యూట్‏గా ఉందో..

బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో వెంకన్న దర్శనం చేసుకున్నారు. కూతురు క్లీంకార తలనీలాలు సమర్పించి.. శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలు అందించారు టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భార్య కూతురితో కలిసి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు రామ్ చరణ్, ఉపాసన దంపతులు.

Ram Charan: అచ్చం తండ్రిలాగే మెగా ప్రిన్సెస్.. మొదటిసారి క్లీంకార ఫేస్ రివీల్.. ఎంత క్యూట్‏గా ఉందో..
Ram Charan, Upasana
Rajitha Chanti
|

Updated on: Mar 27, 2024 | 1:44 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి ఉపాసన కొణిదెల, కూతురు క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో వెంకన్న దర్శనం చేసుకున్నారు. కూతురు క్లీంకార తలనీలాలు సమర్పించి.. శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలు అందించారు టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భార్య కూతురితో కలిసి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు రామ్ చరణ్, ఉపాసన దంపతులు. అయితే శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో క్లీంకార ఫేస్ రివీల్ అయ్యింది. మెగా ప్రిన్సెస్ ను ఉపాసన ఎంతో జాగ్రత్తగా పట్టుకుని వెళ్తుండగా.. ఎంతో అమాయకంగా చూస్తూ కనిపించింది రామ్ చరణ్ తనయ. దీంతో క్లీంకార అచ్చం చెర్రీలాగే ఉందంటూ కామెంట్స్ చేస్తు్న్నారు ఫ్యాన్స్.

క్లీంకార ఫేస్ చూపించకుండా ఇన్నిరోజులు జాగ్రత్తలు తీసుకున్నారు ఉపాసన. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన అందులో క్లీంకార ముఖం కనిపించకుండా ఎమోజీస్ పెట్టేవారు. అయితే క్లీంకారను చూడాలని.. చూపించండి అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేసేవారు. కానీ ఈరోజు చరణ్ బర్త్ డే సందర్భంగా అనుకోకుండా క్లీంకార ఫేస్ రివీల్ కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం చరణ్ పేరు మారుమోగుతుంది. సినీ ప్రముఖులు, అభిమానులకు తమ అభిమాన హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే చరణ్ కు సంబంధించిన రేర్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తున్నారు. మరోవైపు చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈరోజు చరణ్ ప్రాజెక్టుల గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
జీరో కేలరీలు, కొవ్వును కోసేసే సూపర్‌ఫుడ్.. ఊర్లల్లో ఫ్రీగానే..
సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
రెస్టారెంట్ స్టైల్‌ కరకరలాడే ఆలూ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా..
రెస్టారెంట్ స్టైల్‌ కరకరలాడే ఆలూ ఫ్రై.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా..
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే..?
ఘాటెక్కిస్తున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే..?
తెలంగాణలో టాక్సిక్ మూవీ ప్రభంజనం.. గంటలోనే హౌస్ ఫుల్..
తెలంగాణలో టాక్సిక్ మూవీ ప్రభంజనం.. గంటలోనే హౌస్ ఫుల్..
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
'కోచింగ్‌, గైడెన్స్ లేకుండానే 6 నెలల్లో UPSC ప్రిలిమ్స్‌ క్లియర్'
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
ఆ జిల్లా వాసులకు గుడ్‌న్యూస్.. 30 గ్రామాలను కలుపుతూ బైపాస్ రోడ్డు
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన
Meena : ఆ హీరో లేకపోతే తెలుగులో మీనా లేదు.. ఎక్కువ హిట్స్ ఇచ్చిన
గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు
గరిబోళ్ల స్పెషల్ డ్రింక్.. డైలీ ఇలా తాగారంటే ఆ సమస్యలు రావు
ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది
ఎంత తుడిచినా ఇల్లు జిగటగానే ఉంటోందా?.. DIY క్లీనర్ ఇది