గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ అంచనాలతో ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు మూడు సాంగ్స్, టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. వీటితో గేమ్ చేంజర్‌పై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా మూడో సాంగ్‌గా ‘నా నా హైరానా..’ను మేకర్స్ రీసెంట్‌గా విడుదల చేయగా సోషల్ మీడియాలో 47 మిలియన్ వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయటం విశేషం.
‘నా నా హైరానా..’ పాట ప్రోమో విడుదలైనప్పటి నుంచి అభిమానులు, ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. అందుకు కారణం.. రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ మధ్య కెమిస్ట్రీని స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంత గొప్పగా తెరకెక్కించారోనని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు తగినట్లే అందరి అంచనాలకు మించేలా తెలుగులో ‘నా నా హైరానా’.. హిందీలో ‘జానా హైరాన్ సా’.. తమిళంలో ‘లై రానా’ అంటూ మెలోడీ ఆఫ్ ది ఇయర్‌గా గేమ్ చేంజర్ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. మూవీ మేకింగ్ విషయానికి వస్తే శంకర్ మరోసారి పాటలను చిత్రీకరించటంలో తనకు తానే సాటి అని మరోసారి నా నా హైరానా పాటతో నిరూపించుకున్నారని పాటను చూసిన వారందరూ అంటున్నారు. . న్యూజిలాండ్‌లో 6 రోజుల పాటు ఈ పాటను ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీకరించారు. ఒక్కో సన్నివేశం ఒక్కో పెయింటింగ్‌లా విజువల్ బ్యూటీగా మలిచారు శంకర్. దీని కోసం ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడింది. హీరో రామ్ చరణ్ అయితే న్యూజిలాండ్‌లోని ఆక్‌లాండ్ నుంచి పాటను చిత్రీకరించిన క్రిస్ట్ చర్చ్ లొకేషన్‌కు హెలికాఫ్టర్‌లో వెళ్లారు. ఇక ఈ పాట చిత్రీకరణకే రూ.10 కోట్లు ఖర్చు పెట్టారంటే మామూలు విషయం కాదు. సినిమాటోగ్రాఫర్ తిరు ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీకరించిన తీరు అద్భుతం. మళ్లీ మళ్లీ చూడాలనుకునేంత గొప్పగా పాటలోని ప్రతీ ఫ్రేమ్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ఫ్యూజన్ మెలోడీ (వెస్ట్రన్, కర్ణాటిక్ కాంబో)గా ట్యూన్ చేశారు. అలాగే బర్న్ట్ టోన్స్‌ను ఉపయోగించారు.. రెండు మోనో టోన్స్‌ను ఓ స్టీరియో సౌండ్‌గా మార్చి ఈ పాటలో ఉపయోగించటం విశేషం. ఆలీమ్ హకీం డిజైన్ చేసిన స్టైలిష్ లుక్, మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ గ్లోబల్ స్టార్‌ను ఓ సరికొత్త లుక్ కనిపించారు.
సారెగమ మ్యూజిక్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోన్నగేమ్ చేంజర్ సినిమాలోని ఈ పాటను శ్రేయా ఘోషల్, కార్తీక్ పాడారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు.ఇప్పటి వరకు ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి విడుదలైన ‘జరగండి జరగండి’… ‘రా మచ్చా రా.. ’ పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన మూడో సాంగ్ ‘నా నా హైరానా’ ఈ అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది.
రీసెంట్‌గా విడుదలైన ‘గేమ్ చేంజర్’ టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ఇప్పటి వరకు చూపించనటువంటి ఓ సరికొత్త అవతార్‌లో శంకర్ ఆవిష్కరిస్తున్నారు. ఇందులో చరణ్ పవర్‌ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర చేయటంతో పాటు సమాజానికి సేవ చేయాలనుకునే ఉత్సాహవంతుడైన యువకుడి పాత్రలోనూ కనిపించనున్నారు. సినిమాలో హై రేంజ్ యాక్షన్ సన్నివేశాలు, పొలిటికల్ ఎలిమెంట్స్, ఆకట్టుకునే కథనం, నటీనటుల అద్భుతమైన పనితీరు ఇవన్నీ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తాయి.
ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య, సముద్రఖని, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఎంటర్‌టైన్‌మెంట్ రోలర్ కోస్టర్‌గా మూవీ అలరించనుంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
‘గేమ్ చేంజర్’ సినిమాను తమిళంలో ఎస్‌వీసీ, ఆదిత్య రామ్ మూవీస్ విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిల్మ్స్ అనీల్ తడానీ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న యు.ఎస్‌లోని డల్లాస్‌లో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.