K.Viswanath-Ram Charan: ఒకే ఫేమ్‌లో కనువిందు చేస్తున్న కళాతపస్వి కే. విశ్వనాథ్.. మెగా హీరో రామ్ చరణ్..

K.Viswanath-Ram Charan: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి అరుదైన  గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన లెజెండరీ డైరెక్టర్ కే. విశ్వనాథ్.. కళాతపస్వి దర్శకత్వంలో నటించాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటారు..

K.Viswanath-Ram Charan: ఒకే ఫేమ్‌లో కనువిందు చేస్తున్న కళాతపస్వి కే. విశ్వనాథ్.. మెగా హీరో రామ్ చరణ్..
Ram Charan Viswanath

Updated on: Sep 25, 2021 | 4:15 PM

K.Viswanath-Ram Charan: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి అరుదైన  గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన లెజెండరీ డైరెక్టర్ కే. విశ్వనాథ్.. కళాతపస్వి దర్శకత్వంలో నటించాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ అవకాశం ఇప్పటి హీరోలకు లేదు..  సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కె విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. అనంతరం అక్కినేని నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా తెలుగు వెండి తెరపై అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే నంది అవార్డును అందుకున్నారు.ఇక శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారం గెలుచుకుంది. విశ్వనాథ్ కళల నేపథ్యంలో సినిమా తీసినా సాంఘిక సమస్యలతో తీసినా ప్రేక్షకులు పట్టంగట్టారు.  నటుడిగా కూడా ఆయన తనదైన ముద్రవేశారు.  అంతేకాదు కె విశ్వనాధ్ కొన్ని యాడ్స్ లో కూడా నటించి ఆ సంస్థకు మంచి గౌరవం తీసుకొచ్చారు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కళాతపస్వి కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. ఇప్పటికే డిస్ని హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన చెర్రీ ఇప్పుడు మరో సంస్థ కు ప్రచార కర్తగా మారారు. ఈ సంస్థకు ఇంతకు ముందు కళాతపస్వీ విశ్వనాథ్ ప్రచార కర్తగా ఉండేవారు. అదే సువర్ణభూమి.. ఈ యాడ్ లో కే విశ్వనాథ్ బుల్లితెరపై సందడి చేశారు. ఇప్పుడు వయోభారం దృష్ట్యా  కే విశ్వనాధ్  డైలాగ్స్ చెప్పలేకపోయారు.  అందుకే సువర్ణ భూమి చరణ్ ను రంగంలోకి దించినట్లుంది.

తాజాగా సువర్ణభూమి తన కొత్త యాడ్ ను రిలీజ్ చేసింది. ఈ యాడ్ లో రామ్ చరణ్ కె విశ్వనాధ్ లు కలిసి కనిపించడం విశేషం.. చరణ్ సూపర్బ్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తూ. అభిమానులను కట్టుకున్నాడు. అంతేకాదు  ఎవరైనా ఫిట్ గా ఉండాలి.. అయితే జస్ట్ జికల్‌గానే కాదు..అన్నింట్లోనూ…  స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ లైఫ్ కావాలంటే.. ఫైనాన్షియల్ ఫిట్ నెస్ ఉండాలి.. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అది పెరిగేలా ఉండాలి.. ఒకటి నిజం త్వరగా అభివృద్ధి చెందిన వారంతా సరైన ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేయడం వలెనే  అయ్యారు. దానికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటె ఇక సక్సెస్ మనదే… ‘సువర్ణ భూమి’ తరతరాల చెరగని చిరునామా అంటూ.. డైలాగ్స్ చెబుతూ.. కళాతస్వి కె విశ్వనాథ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ యాడ్ లో చెర్రీ లుక్ ఓ రేంజ్ లో ఉంది. ఈ యాడ్ కోసం చరణ్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చరణ్ కు కె విశ్వనాథ్ కలిసి ఒకే ఫేమ్ లో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read: SP Balu Rare Photos: పాటల తోటమాలి ఎస్పీబీ లేరు.. పాట మిగిలే ఉంది.. బాలు స్మృతిలో.. అరుదైన చిత్రమాలిక..(photo gallery)