నెపోటిజం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయా.. అసలు విషయం బయట పెట్టిన స్టార్ హీరోయిన్

|

Jan 10, 2025 | 3:30 PM

టాలీవుడ్ నటీమణుల చిన్ననాటి ఫోటోలు, రేర్ పిక్స్ సైతం ట్రెండ్ అవుతున్నాయి. బర్త్ డే వచ్చినా.. లేదా లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసినా.. తమకిష్టమైన హీరోయిన్ల ఫోటోలను వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే నెట్టింట ఎక్కువగా వినపడే కనపడే అమ్మడి ఫోటోలు గుర్తుపట్టారా.? నెపోటిజం వల్ల అవకాశాలు కోల్పోయాను అని చెప్పి షాక్ ఇచ్చింది ఆమె..

నెపోటిజం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయా.. అసలు విషయం బయట పెట్టిన స్టార్ హీరోయిన్
Actress
Follow us on

చాలా మంది హీరోయిన్స్ తెలుగులో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. ఇలియానా దగ్గర నుంచి రీసెంట్ గా తమన్నా వరకు అందరూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్తున్నారు. అలాగే ఈ ముద్దుగుమ్మ కూడా సౌత్ లో రాణించి ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తెలుగులో తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరితో సినిమాలు చేసింది. కానీ ఈ చిన్నది ఇప్పుడు వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతుంది. ఈ క్రమంలో ఆమె ఓ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను మిస్ చేసుకుంది. ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతుంది ఆ అమ్మడు ఇంతకూ ఆమె ఎవరో..? ఆ సినిమా ఎదో తెలుసా.?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన భామల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరిసరసన సినిమాలు చేసింది ఆకట్టుకుంది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసింది. ఆతర్వాత హిందీలోకి అడుగు పెట్టింది.

ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇండస్ట్రీ గురించి రకుల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నా జీవితంలో నెపోటిజం కారణంగా ఎన్నో చాన్స్‌లు వదులుకున్నాను. సినీ పరిశ్రమలో నెపోటిజం ఉన్నమాట నిజమే అని కామెంట్స్ చేసింది. ఛాన్స్ లు రాలేదు అని నేను ఎప్పుడూ బాధపడలేదు. అయితే తాను ఓ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్నా అని చెప్పింది. స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని బయోపిక్ సినిమాలో ముందుగా రకుల్ ప్రీత్ కు అవకాశం వచ్చిందట. అయితే ఆ సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ఆఫర్ మిస్ అయ్యిందని తెలిపింది రకుల్. ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా అని చెప్పుకొచ్చింది రకుల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి