777 చార్లీ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ నటుడు రక్షిత్ శెట్టి. ఈ మూవీ తర్వాత ఇటీవల సప్త సాగర దాచే ఎల్లో సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాలను తెలుగులో సప్త సాగరాలు దాటి ఎ పేరుతో డబ్ చేయగా.. ఇక్కడ సైతం మంచి రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. కన్నడలో ఈ చిత్రానికి సూపర్ హిట్ రెస్పాన్స్ రాగా.. తెలుగులోనూ డబ్ చేశారు మేకర్స్. అయితే అప్పటికే రక్షిత్ శెట్టికి టాలీవుడ్ లో ఫాలోయింగ్ ఉండడంతో ఈ మూవీకి విశేష ఆదరణ లభించింది. అందమైన జీవితాన్ని గడపాలనుకున్న యువకుడు చేయని నేరానికి జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత అతని జీవితంలో ఎదురైన పరిస్థితులను ప్రేక్షకుల కళ్లముందుకు అద్భుతంగా తీసుకువచ్చారు డైరెక్టర్.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. సప్త సాగరదాచే ఎల్లో.. సైడ్ బి టైటిల్ తో ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను వచ్చే నెల 17న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా సప్త సాగరదాచే ఎల్లో సైడ్ బి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. తొలి సినిమాలోని కథను ఎక్కడ మిస్ చేయకుండా సీక్వెల్ కు లింక్ చేశారు డైరెక్టర్. హీరో జైల్లో ఉన్న సీన్ తో స్టార్ట్ చేసి తన ప్రియురాలు చెప్పే మాటలు విని ఊలిక్కిపడి లేస్తాడు హీరో. ఒకే టీజర్ లో కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో డైలాగులు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం రిలీజ్ అయిన టీజర్ కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత అట్రాక్షన్ అయ్యింది.
ఫస్ట్ పార్ట్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా..ఇప్పుడు సీక్వెల్ లో చైత్ర జే ఆచార్ కనిపించనుంది. ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీతం అందిస్తుండగా.. పరమ్వాహ్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం కన్నడ, తెలుగు అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.