ఆమె అనుకున్నది సాధించింది.. రష్మికతో పెళ్లి క్యాన్సిల్ పై రక్షిత్ శెట్టి కామెంట్స్

|

Feb 16, 2024 | 4:37 PM

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో సినిమాలు చేసింది. అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది తెలుగుతో పాటు బాలీవుడ్, తమిళ్ సినిమాల్లోనూ సినిమాలు చేస్తుంది రష్మిక. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేసింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు.

ఆమె అనుకున్నది సాధించింది.. రష్మికతో పెళ్లి క్యాన్సిల్ పై రక్షిత్ శెట్టి కామెంట్స్
Rakshit Shetty
Follow us on

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అందాల భామ రష్మిక మందన్న తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. యంగ్ హీరోతో మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది రష్మిక. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లతో సినిమాలు చేసింది. అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది తెలుగుతో పాటు బాలీవుడ్, తమిళ్ సినిమాల్లోనూ సినిమాలు చేస్తుంది రష్మిక. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేసింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. ఈ సీనియమా సంచలన విజయం సాధించింది.

అయితే రష్మిక కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసే సమయంలో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. కానీ అనుకోని విధంగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. కెరీర్‌లో ఎదుగుతున్న సందర్భంలో డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకోవడానికి  పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఆమె పై చాలా ట్రోల్స్ వచ్చాయి.

ఇప్పుడు రక్షిత్ శెట్టి, రష్మిక వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా రష్మికతో పెళ్లి క్యాన్సిల్ అవ్వడం పై మరోసారి స్పందించారు రక్షిత్ శెట్టి. ‘మా పెళ్లి ఆగిపోయింది. మా పెళ్లి ఆగితే ఏమైంది.? మేము ఇప్పటికీ టచ్‌‌లోనే ఉన్నాం. రష్మికకు జీవితంలో పెద్ద డ్రీమ్‌ ఉండేది. ఇప్పుడు ఆమె అనుకున్నది సాధించింది. ఆ విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా’ అని అన్నారు హీరో రక్షిత్ శెట్టి. ప్రస్తుతం రక్షిత్ శెట్టి కన్నడ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. అటు రష్మిక కూడా ‘పుష్ప 2’, ‘రెయిన్ బో’, ‘గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు చేస్తుంది.

రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

రక్షిత్ శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.