Akhil Raj : డెలివరీ బాయ్‌తో ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో గొడవ.. వీడియో వైరల్

ఆర్డర్ చేసిన ఫుడ్ బదులు డెలివరీ బాయ్ రాంగ్ ఆర్డర్ ఇవ్వడంతో ఈ గొడవ జరిగిందని తెలుస్తోంది. ఇందుకు గాను సదరు డెలివరీ బాయ్ క్షమాపణలు చెప్పినా ఈ నటుడు, అతని కుటుంబ సభ్యులు డెలివరీ బాయ్ ను దుర్భాషలాడినట్లు ఈ వీడియోలో తెలుస్తోంది.

Akhil Raj : డెలివరీ బాయ్‌తో రాజు వెడ్స్ రాంబాయి  హీరో గొడవ.. వీడియో వైరల్
Akhil Raj

Updated on: Jun 29, 2026 | 8:39 PM

‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ డెలివరీ బాయ్‌ పై అతను దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఆర్డర్ చేసిన ఫుడ్ కు బదులు డెలివరీ బాయ్ రాంగ్ ఆర్డర్ ఇవ్వడంతోనే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు గాను తాను క్షమాపణలు చెప్పినా హీరోతో పాటు అతని తల్లి అతనితో అమర్యాదగా ప్రవర్తించారని డెలివరీ బాయ్ ఆవేదన వ్యక్తం చేస్తుండడం ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అలాగే డెలివరీ బాయ్ మీదకు అఖిల్ వెళుతుంటే అతని తండ్రి అడ్డుకుంటున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు వీడియోను డిలీట్ చేయాలని అఖిల్ అడిగినట్లు స్పష్టంగా వినిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

ఇవి కూడా చదవండి

కాగా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా సంచలన విజయం సాధించింది.  ఏ మాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమా ట్యాగ్ తో రిలీజైన ఈ సినిమా ఊహించని విధంగా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. తెలంగాణ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ నిజ సంఘటన ఆధారంగా కొత్త దర్శకుడు సాయిలు కంపాటి ఈ సినిమాను తెరకెక్కించాడు. అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేగాకుండా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ – 2025లో భాగంగా ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుంది.

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us