
చిన్న సినిమా గా వచ్చి సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాయి. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ సినిమాలో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో భయపెట్టాడు. నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. చాలా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ ఇప్పటికే రూ.10 కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు సాయిలు. కొత్త డైరెక్టర్ అయినా తన టేకింగ్, మేకింగ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే కొత్త వారైనా హీరో, హీరోయిన్లు కూడా చాలా సహజంగా నటించారని ప్రశంసలు వస్తున్నాయి. కాగా తమ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి రాజు వెడ్స్ రాంబాయి చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సినిమా మరింత మందికి రీచ్ అయ్యేలా మహిళలకు ఉచిత సినిమా టికెట్ల ఆఫర్ ను ప్రకటించింది.
‘మా రాంబాయి కథ’.. ప్రతి మహిళ కోసం.. ఆంధ్రా అండ్ సీడెడ్ మేజర్ సెంటర్స్ లో ఫ్రీగా రాజు వెడ్స్ రాంబాయి సినిమా స్క్రీనింగ్’ అంటూ ఈ విషయాన్ని ప్రకటించారు మేకర్స్. అయితే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఉండనుంది. అది కూడా రేపు ఒక్క రోజు మాత్రమే. సినిమా చూడాలనుకుంటోన్న మహిళలు డైరెక్టుగా థియేటర్ల వద్దకు వెళ్లి టికెట్లు తీసుకోవచ్చు.
The Biggest #Giveaway:
Free Ticket For all women across AP & TSమనస్సును కదిలించే రాంబాయి కథ.. ప్రతి మహిళ కోసం ❤️#RajuWedsRambai ఆంధ్రా & సీడెడ్ మేజర్ సెంటర్స్ లో లేడీస్ కి రేపు ఫ్రీ స్క్రీనింగ్
Note: థియేటర్ దగ్గర ఫ్రీ టికెట్స్ తీసుకోండి
The Greatest Love Story in Cinemas… pic.twitter.com/WjhL0k4o78
— Taraq(Tarak Ram) (@tarakviews) November 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి