AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: ఒక్కరూ నన్ను పట్టించుకోలేదు.. అది నా గర్వాన్ని పూర్తిగా అణచివేసింది.. రజినీకాంత్ కామెంట్స్ వైరల్..

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం దక్షిణాదిలోనే కాకుండా యావత్ సినీ ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఏడు పదుల వయసులోనూ ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రజినీకాంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి. అసలేం జరిగిందంటే.

Rajinikanth: ఒక్కరూ నన్ను పట్టించుకోలేదు.. అది నా గర్వాన్ని పూర్తిగా అణచివేసింది.. రజినీకాంత్ కామెంట్స్ వైరల్..
Rajinikanth
Rajitha Chanti
|

Updated on: May 13, 2026 | 2:05 PM

Share

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్ల మంది అభిమానుల ఆరాధ్య దైవం, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత స్థానంలో ఉన్న అగ్రనటుడు ఆయన. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతో నిరాడంబరంగా, ఆధ్యాత్మిక చింతనతో ఉంటారనేది అందరికీ తెలిసిందే. అయితే, ఒకానొక సందర్భంలో తన అహంకారం (Ego) ఎలా అణిచివేయబడిందో ఆయన స్వయంగా పంచుకున్న అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజాగా బెంగుళూరులో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. నిజానికి రజనీకాంత్ ఎక్కడికి వెళ్లినా, ఆయనను చూడటానికి జనం ఎగబడతారు, ఫోటోల కోసం ప్రయత్నిస్తారు. ఆయనకు ఉండే స్టార్‌డమ్ అలాంటిది. కానీ ఆ ఆశ్రమంలో పరిస్థితి భిన్నంగా ఉందని.. కనీసం ఒక్కరు కూడా తనను పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు.

“హిమాలయాల తర్వాత ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆశ్రమం నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇక్కడ నేను రెండు రోజులు ఉందామని ప్లాన్ చేసుకుని వచ్చాను.. కానీ 15 రోజులు ఉండిపోయాను. ఆయన నన్ను తనతో కలిసి వేదికపైకి పిలిచారు. నేను మీతో వస్తే మీకు డిస్టర్బ్ అవుతుంది కదా అని అన్నాను. ఆయన ఏం పర్లేదు అన్నారు. దీంతో నేను గురుదేవ్ పిలుపు మేరకు ఆయనతో కలిసి వేదికపైకి వెళ్లాను. అక్కడున్న వేల మంది జనాన్ని.. ముఖ్యంగా ఎంతో మంది తమిళ భక్తులను చూసి కాస్త కంగారు పడ్డాను. అందరూ నన్ను చుట్టుముట్టేస్తారేమో .. ఫోటోస్, ఆటోగ్రాఫ్స్ కోసం నా వెంటబడతారేమో అనుకున్నా. కానీ అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అక్కడ ఒక్కరూ కూడా నన్ను పట్టించుకోలేదు. అందరి దృష్టి కేవలం గురుదేవుల మీద మాత్రమే ఉంది. నేను హాయ్ అని చేతులు ఊపినా ఎవరూ చూడలేదు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

నా జీవితంలో ఎంతోమంది రాజకీయ నాయకులను, పారిశ్రామికవేత్తలను చూశాను. కానీ ఇంతటి అనుభవం ఎప్పుడూ కలగలేదు. ఆ ఘటన నా గర్వాన్ని పూర్తిగా అణచివేసింది. అప్పుడు అర్థమైంది. సెలబ్రెటీ హోదా అనేది వస్తుంటుంది. పోతుంటుంది. కానీ ఆధ్యాత్మికతలో ఉండే ఈ హోదానే అత్యున్నతమైనది. ప్రపంచమంతా నన్ను సూపర్ స్టార్ అంటుంటారు. కానీ ఆ ఆశ్రమంలో మాత్రం నేను సామాన్య మానవుడిని అని నాకు అనిపించింది. ఆ అనుభవం నాకు ఎంతో ప్రశాంతత ఇచ్చింది. మనిషి తన హోదా, గుర్తింపు కంటే మించి ఆధ్యాత్మికంగా ఎదగడమే గొప్పది” అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు రజినీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి..

ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద లాభాపేక్షలేని సంస్థలలో ఒకటి, దీనిని 1981లో శ్రీ శ్రీ రవిశంకర్ స్థాపించారు. ప్రాచీన జ్ఞానం, ఆధునిక విజ్ఞాన శాస్త్ర సమ్మేళనం ద్వారా, ముఖ్యంగా ఒత్తిడి తగ్గింపు , మానసిక శ్రేయస్సుపై దృష్టి సారిస్తూ, వ్యక్తులను , సమాజాలను ఉన్నతీకరించడానికి , సాధికారత కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ తన పేర్కొంది.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us