తన రికార్డుల్ని తనే టార్గెట్ చేస్తారన్న పేరును సుస్థిరం చేసుకుంటున్నారు జక్కన్న. ప్రస్తుతం బాహుబలి2ని వెంటాడి వేటాడుతున్నారు రామ్ అండ్ భీమ్… తమ లక్ష్యాన్ని ఛేదించడంలో ఎంతవరకొచ్చారు… ఈ మల్టిపుల్ స్టార్‌డమ్ మీద దర్శకధీరుడు పెట్టుకున్న ఆశలు ఎంతవరకు నేరవేరాయి అంటే.. ఆడుతూపాడుతూ ఆరామ్‌గానే థౌజండ్ వాలా వైపు దూసుకుపోతోంది జక్కన్న తాజా విజువల్ వండర్ అని చెప్పవచ్చు. ట్రిపులార్(RRR) ఫస్ట్ వీకెండ్ గ్రాస్ 500 కోట్లు క్రాసైనట్లు ప్రకటించారు నిర్మాతలు. ఇండియన్ సినిమా గ్లోరీని దర్శకధీరుడు మళ్లీ తీసుకొచ్చారని, బిగ్ స్క్రీన్స్ ఇక సంక్షోభం నుంచి బైటపడ్డట్టేనని భరోసానిచ్చింది ట్రిపులార్ సినిమా. ఇది చాలదంటూ వెయ్యి కోట్ల మైల్‌స్టోన్ కోసం వెయిటింగ్‌లో వుంది ఫ్యాన్స్ ఆఫ్ రామ్ అండ్ భీమ్.
హాలిడేస్ లేని సీజన్‌లో రిలీజైనప్పటికీ, జక్కన్న మ్యాజిక్ మీదున్న మోజుతో థియేటర్స్‌కి క్యూ కడుతోంది ప్రేక్షకజనం. ఓవర్సీస్‌లో అయితే తొక్కుకుంటూ పోతూనే వుందీ భారీ సినిమా. ఫస్ట్ వీకెండ్ వసూళ్లతోనే 9 మిలియన్ డాలర్ల మార్క్‌ని దాటి…సెకండ్ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. గత వారంలో వచ్చిన హాలీవుడ్ మూవీస్‌ని కూడా క్రాస్ చేసింది జక్కన్న మూవీ.క్రౌడ్ పుల్లర్ మూవీగా ప్రూవ్ చేసుకున్నప్పటికీ.. బాహుబలి2 రేంజ్‌లో బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేస్తుందా లేదా అనే డైలమా అయితే తప్పడం లేదు. ఇక ఈ సినిమా ఇప్పటికే 600 కోట్లను వసూల్ చేసింది. నేటితో ఈ సినిమా 700 మార్క్ ను క్రాస్ చేయనుంది. మరో నాలుగు రోజులు ఇలాగే కొనసాగితే 1000 కోట్ల మార్క్ ను ఈజీగా టచ్ చేస్తుంది అంటున్నారు. మరో వైపు హిందీలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కెరీర్ లో 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన మూడో చిత్రంగా ట్రిపుల్ ఆర్ నిలిచింది.ఇక ఏప్రిల్ సెకండ్ వీకెండ్ దాకా మరో పెద్ద సినిమా ఏదీ లేదు కనుక… మరో రెండు వారాల పాటు సాలిడ్ రన్‌కి చాన్సుంది. బీ అండ్ సీ సెంటర్స్‌లో బుకింగ్స్ జోరు ఇలాగే కొనసాగితే… సర్‌ప్రైజింగ్ ఫిగర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చన్నది ట్రేడ్ ఎనలిస్టుల మాట.
మరిన్ని ఇక్కడ చదవండి :