
అందాల భామ నిధిఅగార్వల్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మొన్నటివరకు టాలీవుడ్ సినిమాలో మెరిసిన ఈ భామ. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో ఈ అమ్ముడు ప్రేక్షకుల ముందుకు రానుంది. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ భామ.. టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ మెప్పించింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ కు హిట్స్ మాత్రం అంతగా పడలేదు. ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహరవీరమల్లు సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.
కాగా తాజాగా సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో నిధి లవ్ సింబల్ పోజ్ ఇస్తూ ఫోటోను షేర్ చేసింది. కాగా ఆమె చేతిలో ఎదో పెన్ను తో రాసి ఉంది. దాన్ని గమనించిన ఓ అభిమాని. మీ చేతిలో ఎదో రాసి ఉంది. అది ఏంటో తెలుసుకోవడానికి నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దానికి నిధి రిప్లే ఇచ్చింది. అయ్యో మళ్లీ దొరికిపోయినా అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యింది నిధి. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
See you at 6.30 💕 ask me your questions here.. #AskNidhhi #TheRajaSaab pic.twitter.com/TeMPwHZrFC
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 28, 2025
Oops got caught again 🙈#AskNidhhi #TheRajaSaab https://t.co/TEkLhKxxAJ
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) December 28, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.