బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ఎలిమినేషన్స్ ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తున్నాయి. ఎవరు హౌస్ లో ఉంటారో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారో ఊహించడం కష్టంగానే ఉంది. ఇప్పటికే టాప్ లో ఉంటారన్న వాళ్లంతా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన ఎలిమినేషన్ కూడా ఊహించని ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఫైమాను ఎలిమినేట్ చేసినా తన దగ్గర ఉన్న ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’తో ఆమె సేవ్ అయిపోయింది. కానీ ఇంకో కంటెస్టెంట్ బలి అయ్యాడు. నిన్న జరిగిన ఎలిమినేషన్ నామినేషన్స్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ నిలిచారు. వీరిలో ఆది రెడ్డి, ఫైమా, రాజ్ నామినేషన్ లో ఉన్నారు. అయితే ఫైమాను ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో నాగ్ దాన్ని నువ్వే వాడుకుంటావా లేక వేరే వాళ్ళను సేవ్ చేస్తావా అని ప్రశ్నించగా తర్వాత చెప్తా అని బదులిచ్చింది. ఆ తర్వాత జరిగిన లెవల్ లో ఆది రెడ్డి సేవ్ అయ్యాడు.
ఇక చివరకు ఫైమా.. రాజ్ లు మిగిలారు. ఇక ఇప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకుంటావా అని ఫైమా ను నాగ్ అడిగారు. ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ను నీకే ఇచ్చేస్తానని ఫైమా రాజ్‌తో వ్యక్తిగతంగా చెప్పింది. కానీ, రాజ్ దానికి ఒప్పుకోలేదు. ఈ పాస్ నువ్వే గెలుచుకున్నావు కాబట్టి దాన్ని నీ దగ్గరే పెట్టుకోవాలి అని అన్నాడు. హౌస్ మేట్స్ కూడా రాజ్ చెప్పిందే కరెక్ట్ అనడంతో ప్రేక్షకుల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని.. ఫైమా దగ్గర పాస్ తాను వాడుకొని సేవ్ అయ్యే ఉద్దేశం లేదని రాజ్ చెప్పాడు. నాగ్ కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటే బిగ్ బాస్ ఇచ్చిన ఒక కొత్త శక్తి అని.. దాన్ని వాడుకోవాలని అన్నారు
దాంతో ఆమె ఆ పాస్ ను వాడుకుంది. ఫైమా వద్ద ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో ఆమె సేవ్ అయ్యింది. మొత్తానికి రాజ్ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే హౌస్‌లో చాలా మంది ఎమోషనల్ అయ్యారు. ఇక ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైకి వచ్చిన రాజ్ తన జర్నీని ఒకసారి చూసుకున్నాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు.