Rahul Ravichandran : నేచురల్ స్టార్ నాని శ్యామ్‌ సింగరాయ్‌’ మూవీలో నటించనున్న మరో హీరో , దర్శకుడు

|

Mar 23, 2021 | 5:13 PM

నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్‌ ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మరో హీరో నటించబోతున్నాడు. ఇప్పటికే తెలుగులో మంచి హిట్ కొట్టిన ఆ హీరో.. రీసెంట్‌గా కింగ్‌ నాగార్జునను...

Rahul Ravichandran : నేచురల్ స్టార్ నాని శ్యామ్‌ సింగరాయ్‌’ మూవీలో నటించనున్న మరో హీరో , దర్శకుడు
Nani's Shyam Singha Roy Mov
Follow us on

Rahul Ravichandran : నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్‌ ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మరో హీరో నటించబోతున్నాడు. ఇప్పటికే తెలుగులో మంచి హిట్ కొట్టిన ఆ హీరో.. రీసెంట్‌గా కింగ్‌ నాగార్జునను డైరెక్టర్‌ కూడా చేశాడు. ఇంతకీ ఆ హీరో కాదు ప్రముఖ సింగర్ చిన్మయి భర్త నటుడు.. రాహుల్ రవీంద్రన్.

అవును అందాల రాక్షసి సినిమాతో తెలుగు వారికి దగ్గరై.. శ్రీమంతుడు వంటి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు.. ఇక ఇటీవలే కింగ్ నాగార్జున తో మన్మదుడు2 మూవీని తెరకెక్కించాడు. తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకున్న రాహుల్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇదే విషయాన్ని రాహులే స్వయంగా ట్విట్టర్‌లో వేదికగా కన్ఫామ్ చేశాడు.

ఇక ఈ సినిమాకు రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నాయికలుగా నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఇటీవలే విడుదలైన నాని ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకు కనిపించని లుక్‌లో దర్శనమిచ్చి నాని అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి రాహుల్‌ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే…!

Also Read: మహిళలు బహుపరాక్.. ఈ వ్యాధి ఉన్న స్త్రీలో కరోనా వైరస్ బారినపడే అవకాశం ఎక్కువట

ఒక దేశంలో అసలే చీకటి పడదు.. మరో దేశంలో పగలు అసలే ఉండదు.. వింతైన దేశాలు చూడాలని ఉందా..?