
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో రఘు కుంచె కూడా ఒకరు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, వ్యాఖ్యాతగా, డబ్బింగ్ కళాకారుడిగా, రచయితగా.. ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటారు రఘు కుంచె. ప్రారంభంలో పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు రఘు. బంపర్ ఆపర్, అహ నా పెళ్లంట, దగ్గరగా దూరంగా, మామ మంచు అల్లుడు కంచు, దేవుడు చేసిన మనుషులు, లేడీస్ అండ్ జెంటిల్‌మన్, దొంగాట, పలాస 1978, నాయకి, గేదెల రాజు తదితర సినిమాలకు సంగీతం అందించారు రఘు. ఇక ఇప్పుడు నటునిగానూ సత్తా చాటుతున్నారాయన. మా నాన్న నక్సలైట్, హిడింబ, కృష్ణమ్మమ, ఆపరేషన్ రావణ్, బాలు గాని టాకీస్, శ్రీశ్రీశ్రీ రాజవారు, దేవగుడి, గేదెల రాజు తదితర సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు రఘు. కాగా సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో రఘుకు మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, అలాగే దివంగత సంగీత దర్శకుడు చక్రితో రఘుకు మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన రఘు కుంచె చక్రి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా ఆయన మరణంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు.
‘చక్రి విపరీతంగా తాగి చనిపోయాడు’ అనేది పచ్చి అబబద్ధం. చక్రి వ్యక్తిగతంగా ఎంతో మంచి వ్యక్తి. ఎంతోమందికి అన్నం పెట్టిన గొప్ప మనసున్న మనిషి. ఆయన కార్యాలయాన్ని “చక్రి సత్రం” అని పిలిచేవారు. అక్కడ రోజుకు 30-50 మంది భోజనం చేసేవారని చెప్పారు. తన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరినీ ఆకలితో పంపించే వాడు కాదు. అలాగే ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకునేవాడు కాదు. ఇక ఆయన మరణానికి ప్రధాన కారణం ఆయన జీవనశైలినే అని చెప్పవచ్చు. విపరీతమైన పని ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం, , అతిగా పని చేయడం, తీవ్రమైన ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం చక్రి ఆరోగ్యాన్ని దెబ్బ తీశాయి. చివరి రోజుల్లో అయితే ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో , కనీసం రెండు అడుగులు వేయడానికే చాలా ఆయాసపడేవారు. చివరకు ట్రీట్మెంట్‌కు బాడీ సహకరించని స్థితికి చేరుకుంది. ఏదేమైనా ఆయన మంచి తనమే ఆయననను పొట్టన పెట్టుకుంది’ అని చక్రి గురించి చెప్పుకొచ్చారు రఘు కుంచె. ప్రస్తుతం ఈ సింగర్ కమ్ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Raghu Kunche, Chakri
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి