‘రాక్షసి’ సినిమాకు మలేషియా మంత్రి ఫిదా..ఉద్వేగంతో రివ్యూ!

|

Sep 03, 2019 | 3:44 PM

సౌత్ ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. బాలీవుడ్ కూడా దక్షణాది సినిమాలను రీమేక్ చేసుకుంటూ, ఇక్కడి దర్శకులతో మూవీస్ చేస్తుంది. బీ టౌన్ జనాలు మన హీరోస్‌కు, కంటెంట్‌కు ఎంత ఇంప్రెస్ అవుతున్నారో చెప్పడానికి ఇటీవలే విడుదలయిన సాహో సినిమానే ఉదాహారణ. డివైడ్ టాక్‌తో ఓన్లీ హిందీ వెర్షన్ మాత్రమే 100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇదిలా ఉండగా ప్రముఖ నటి జ్యోతిక లీడ్ రోల్‌లో నటించిన ‘రాక్షసి’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. […]

రాక్షసి సినిమాకు మలేషియా మంత్రి ఫిదా..ఉద్వేగంతో రివ్యూ!
Maszlee praises Tamil film 'Raatchasi'
Follow us on

సౌత్ ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. బాలీవుడ్ కూడా దక్షణాది సినిమాలను రీమేక్ చేసుకుంటూ, ఇక్కడి దర్శకులతో మూవీస్ చేస్తుంది. బీ టౌన్ జనాలు మన హీరోస్‌కు, కంటెంట్‌కు ఎంత ఇంప్రెస్ అవుతున్నారో చెప్పడానికి ఇటీవలే విడుదలయిన సాహో సినిమానే ఉదాహారణ. డివైడ్ టాక్‌తో ఓన్లీ హిందీ వెర్షన్ మాత్రమే 100 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

ఇదిలా ఉండగా ప్రముఖ నటి జ్యోతిక లీడ్ రోల్‌లో నటించిన ‘రాక్షసి’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథ, కథనాలు, నటన అద్భుతంగా ఉండటంతో సినిమాను జనాలు బాగా ఆదరించారు. తాజాగా ఈ మూవీపై మలేషియా విద్యాశాఖ మంత్రి మస్‌జ్లీ బిన్‌ మాలిక్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చిత్రాన్ని తాజాగా చూసిన ఆయన సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘రాక్షసి’ సినిమాకు గౌతమ్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన ఈ మూవీలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా నటించారు. ఓ ప్రభుత్వ పాఠశాల రాంగ్ రూట్‌లో వెళ్తుంటే..బెత్తం పట్టుకోని అక్కడి టీచర్లను, పిల్లలను సరైన మార్గంలో నడిపిస్తుంది.

ఈ సినిమాను చూసిన మలేషియా మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిప్రాయాలను పోస్ట్‌ చేశారు. ‘రెండు నెలల క్రితం ఈ సినిమా విడుదలైంది. గత రాత్రి అధికారులతో కలిసి ఈ సినిమా చూశాను. స్వయంగా ఈ సినిమా రివ్యూ రాయాలని నిర్ణయించుకున్నా. ఇది అందరూ చూడాల్సిన సినిమా. కథ అద్భుతంగా ఉంది. జ్యోతిక పాత్ర పర్‌ఫెక్ట్‌గా ఉంది. విద్యా శాఖ మంత్రిగా ఈ సినిమా చూడటం విభిన్న అనుభూతినిచ్చింది. సినిమాలోని ప్రతి సన్నివేశం మా దేశ పరిస్థితుల్ని ప్రతిబింబించింది’.

”గీతా రాణి’ (జ్యోతిక పాత్ర) ఓ గొప్ప సూపర్‌ హీరో క్యారెక్టర్‌. వ్యవస్థలో మార్పు తీసుకురావడం కష్టమైన పనికాదని నిరూపించారు. విద్యా రంగంలో విజయవంతం కావడానికి ఉన్న ఎన్నో పథకాల్ని ఈ సినిమాలో వివరించారు. విద్యార్థులు మధ్యలోనే బడిమానేయకుండా గీత ఎంతో కృషి చేశారు. చివరికి పోలీసుల సహాయం కూడా తీసుకున్నారు. ఇలాంటి సమాజం కోసమే మేం కూడా ప్రయత్నిస్తున్నాం. గీత విద్యార్థులతోనే కాకుండా వారి తల్లిదండ్రులతోనూ మంచి బంధం ఏర్పరచుకున్నారు. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు కూడా కచ్చితంగా ఉండాలని వివరించారు. అన్నీ కోణాల్ని దృష్టిలో ఉంచుకుని ఓ సినిమాను తీయడం గొప్ప విషయం. స్థానికంగా వచ్చే మార్పు వల్లే విద్యా రంగంలో పురోగతి సాధించగలమనేది నా అభిప్రాయం. అప్పుడే పథకాలు కూడా వారి జీవితాల్లో మార్పులు తీసుకురాగలుగుతాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, చదువుకున్న వారు, అందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా’ అని ఆయన ఓ సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.