హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. దామోదర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన శాన్వి మేఘన, గీత్ సైనీ హీరోయిన్స్‌గా నటించారు. మూవీ విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఈరోజు వైజాగ్‌లో పుష్పక విమానం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు.
తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా ప్రమోట్ చేసేందుకు విజయ్ దేవరకొండ.. పుష్పక విమానం ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈనెల10న మహబూబ్‌నగర్‌లోని తమ సొంత థియేటర్ ఏవీడీ సినిమాస్‌లో పుష్పక విమానం మూవీ స్పెషల్ ప్రీమియర్ షోను వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోకు విజయ్ రానున్నాడు.
పుష్పక విమానం ట్రైలర్‌ను ఇటీవలే అల్లు అర్జున్ చేతుల మీదిగా విడుదల చేశారు. ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తోన్న యువకుడు తన పెళ్లి తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు.. వాటిని ఎలా అధిగమించాడనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కినట్టు పుష్పక విమానం ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
Read Also.. Nivetha Pethuraj: న్యూ ఫోటో స్టిల్స్ తో కుర్రోళ్ళ మతి పోగొడుతున్న నివేత పేతురాజ్ ఫొటోస్..