పూరి మ్యూజింగ్స్..ప్ర‌జంట్ టాక్ ఆఫ్ టాలీవుడ్..

చిత్ర ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్..స‌మాజం, అందులోని వ్య‌క్తులు, వారి స్వభావాల‌ను చదివేశాడు. అందుకే ఆయ‌న మాట్లాడుతుంటే ఆవేశంతో కూడిన వేదాంతం వినిపిస్తూ ఉంటుంది.

పూరి మ్యూజింగ్స్..ప్ర‌జంట్ టాక్ ఆఫ్ టాలీవుడ్..

Updated on: Jul 24, 2020 | 6:21 PM

చిత్ర ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్..స‌మాజం, అందులోని వ్య‌క్తులు, వారి స్వభావాల‌ను చదివేశాడు. అందుకే ఆయ‌న మాట్లాడుతుంటే ఆవేశంతో కూడిన వేదాంతం వినిపిస్తూ ఉంటుంది. టాపిక్ ఏదైనా క్లియ‌ర్ క‌ట్ గా త‌న వెర్ష‌న్ చెబుతాడు పూరి. లాగ్ చేయ‌కుండా, సాగ తీయకుండా పాయింట్ మాట్లాడ‌తాడు. అందుకే స‌హ‌జంగా హీరోల‌కు ఉండే క్రేజ్..ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైర‌క్ట‌ర్ కి ఉంటుంది. ఆయ‌న ఏం మాట్లాడుతున్నా అదేదో జీవితానికి ఉపయోగప‌డే అంశంలా కూర్చోని వినాల‌నిపిస్తుంది. అందుకే పూరి త‌న ఐడియాల‌జీని త‌న‌ను అనుస‌రించేవాళ్ల‌తో పంచుకోడానికి కొత్త పంథాను ఎన్నుకున్నాడు. చాలా మంది ప్ర‌ముఖుల లాగేనే పోడ్ కాస్ట్ లో ఖాతా తెరిచారు.

అందులో మ్యూజింగ్స్ పేరుతో త‌న అనుభ‌వాలు, భావాలు, ఆలోచ‌న‌లు షేర్ చేసుకుంటున్నారు. ఆడియో మెసేజుల‌తో త‌త్వాన్ని బోధిస్తూ ఈ కరోనా సంక్షోభ స‌మయంలో టాక్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అయ్యారు పూరి. ఈ ఆడియో వెర్ష‌న్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఆయ‌న ఐడియాల‌జీ ఇంకాస్త లోతుగా తెలుస్తోంది. కుదిరితే మీరూ ఒక‌సారి ఒంట‌రిగా కూర్చోని హెడ్ సెట్ పెట్టేయండి.