Puri Jagannadh: ‘లైగర్’ కొత్త కథ.. ఆ సినిమాతో పోల్చకండి.. క్లారిటీ ఇచ్చిన పూరి..

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రానున్న యాక్షన్ ఎంటర్టైనర్ లైగర్. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

Puri Jagannadh: లైగర్ కొత్త కథ.. ఆ సినిమాతో పోల్చకండి.. క్లారిటీ ఇచ్చిన పూరి..
Puri Jagannadh

Updated on: Jul 23, 2022 | 4:31 PM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh)దర్శకత్వంలో రానున్న యాక్షన్ ఎంటర్టైనర్ లైగర్( Liger). క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, పాట, టీజర్, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వెరీ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. సినిమా పై అంచనాలను ఈ ట్రైలర్ ఆకాశానికి చేర్చిందనడం లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ముంబైలోని ఓ చాయ్ వాలా బాకర్స్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమాలో చూపించనున్నారు పూరి. ఇక ట్రైలర్ లో పూరి మార్క్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎక్కడ తగ్గకుండా తనదైన స్టైల్ లో ట్రైలర్ ను కట్ చేశారు. అయితే ఈ సినిమాను పూరి గతంలో చేసిన అమ్మా నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమాతో పోల్చుతున్నారు కొందరు.

లైగర్ సినిమాలోని సీన్స్ ను అమ్మా నాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమాలోని సీన్స్ తో పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ హీరోగా వచ్చిన అమ్మానాన్నా ఓ తమిళ్ అమ్మాయి సినిమాలూ రవితేజ కూడా బాక్సర్ గా కనిపించాడు, అలాగే అక్కడ కూడా హీరో తల్లి దగ్గరే పెరుగుతాడు. లైగర్ లోనూ విజయ్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు, ఇక్కడ కూడా తల్లిదగ్గరే పెరుగుతాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇలా ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ తో పూరి గత సినిమాను పోల్చడం పై డైరెక్టర్ పూరిజగన్నాథ్ స్పందించారు. లైగర్ సినిమా పూర్తిగా కొత్త సినిమా అని, తన పాత సినిమానుంచి ఎలాంటి విషయాలను తీసుకోలేదని, ఇది ఎంఎంఏ నేపథ్యంలో వచ్చే ఓ క్రేజీ లవ్ స్టోరీ ఉన్న పక్కా కమర్షియల్ యాక్షన్ డ్రామా అని చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్. ఇక లైగర్ సినిమా ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి