AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అందరి ముందు భార్య కాళ్లు కడిగి.. ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్న తెలుగు నటుడు..

పంచ్‌లతోనే కాదు.. జీవితంతోనూ ఫైట్ చేసినవాడు పంచ్ ప్రసాద్. రెండు కిడ్నీలు ఫెయిల్ అయినా ఆత్మస్థైర్యం వదలకుండా పోరాడి.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో సెకండ్ లైఫ్ సాధించాడు. ఆ కష్టకాలంలో తనకు ఊపిరిగా నిలిచిన భార్య సునీతకు కృతజ్ఞతగా.. ఆమె కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న క్షణం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.

Tollywood: అందరి ముందు భార్య కాళ్లు కడిగి.. ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్న తెలుగు నటుడు..
Emotional Moment
Ram Naramaneni
|

Updated on: Jan 14, 2026 | 6:16 PM

Share

పంచ్‌లకు పెట్టింది పేరు నటుడు ప్రసాద్. అందుకు అతని పేరు పంచ్ ప్రసాద్‌గా స్థిరపడిపోయింది. మాట్లాడే ప్రతి మాటకు కౌంటర్ పంచ్ వేయడంటో దిట్ట. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఇతర ఈవీ ఈవెంట్స్‌లోనూ ఇతను సందడి చేస్తూ ఉంటాడు. సినిమాల్లోనూ అప్పుడప్పుడు మెరుస్తున్నాడు. అయితే పంచ్ ప్రసాద్ నిజ జీవితంలోనూ ఫైటర్. రెండు కిడ్నీలు ఫెయిల్ అయినప్పటికీ.. అతను ఆత్మస్థైర్యంతో పోరాడి.. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. జీవన్‌దాన్ ద్వారా కిడ్నీ దాత దొరకడంతో.. 2023లో ఆయనకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ఆ తర్వాతికాలంలో కోలుకుని ఇప్పుడు యథావిధిగా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు పంచ్ ప్రసాద్. అయితే ఆ కష్టకాలంలో తనకు తన భార్య సునీత ఎంతగానో సపోర్ట్ చేసింది ఓ కార్యక్రమంలో ఎమోషనల్ అయ్యాడు పంచ్ ప్రసాద్. కలిసి బ్రుతుకుదాం అనుకుని ఎవరైనా పెళ్ళి చేసుకుంటారని.. కానీ తన భార్య తనను బ్రతికించడానికే పెళ్లి చేసుకుందని చెప్పుకొచ్చాడు.

సాధారణంగా తల్లిదండ్రుల కాళ్లు కడిగి.. నెత్తిన చల్లుకుంటారని..  కానీ తన జీవితంలో ఇంతగా సాయపడిన తన భార్య కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటానంటూ.. ఓ టీవీ కార్యక్రమంలో ఆ పని చేసి సూపర్ అనిపించుకున్నాడు పంచ్ ప్రసాద్. తనను తప్పుగా అనుకున్నా పర్లేదు కానీ.. తన భార్య ఏం చేసిందో తనకు తెలుసని భార్య కాళ్లు కడిగి.. ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నాడు. తనకు పునర్జమ్మను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు. బతకడు పెళ్లి చేసుకోవద్దని ఎంత మంది చెప్పినా వినకుండా.. సునీత పెళ్లాడి తన జీవితాన్ని నిలబెట్టింది అంటూ కంటతడి పెట్టుకున్నాడు ప్రసాద్. అంతేకాదు ఈ ప్రయాణం తమకు కొంచెం కూడా ఇబ్బంది పెట్టని.. పిల్లలకు కూడా ఐ లవ్ యూ చెప్పి.. అందరి మనసులు గెలుచుకున్నాడు ఈ నటుడు. ఏది ఏమైనా సునీత లాంటి మహిళకు చేతులెత్తి దండం పెట్టినా తక్కువే. ఈ జంట నిండు నూరేళ్లు.. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని ఈ సంక్రాంతి పర్వదినాన కోరుకుందాం…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.