
సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టా్ర్ చిరంజీవి. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసింది. ఈ చిత్రాన్ని చిరు పెద్ద కూతురు సుష్మిత కొణిదెల నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సుష్మిత కొణిదెల ఇటీవల తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ సినిమా విజయం గురించి మాట్లాడారు. ప్రేక్షకుల ఆనందం, థియేటర్లకు కుటుంబాలు తిరిగి రావడాన్ని చూస్తుంటే సంతోషంగా ఉందని ఆమె అన్నారు. మెగా అభిమానులు “బాస్ ఈజ్ బ్యాక్” అని సంబరాలు చేసుకుంటున్నారని, వింటేజ్ చిరంజీవిని చూడాలని వారు ఆశించారని తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను సమతుల్యం చేశారని ఆమె ప్రశంసించారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో తాను మొదట కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశానని వెల్లడించారు. చిరంజీవి ఫిట్‌నెస్, మానసిక ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ, పని పట్ల ఆయనకున్న అంకితభావం గురించి ఆమె వివరించారు. సెట్‌లో చిరంజీవి దృష్టి పూర్తిగా దర్శకుడి అవసరాలపైనే ఉంటుందని ఆమె అన్నారు. వెంకటేష్, నయనతార వంటి నటీనటులతో కలిసి పనిచేయడం ఆహ్లాదకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలో తాను గతంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా మాత్రమే పనిచేశానని అన్నారు. తాను చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసినప్పుడు కూడా రెమ్యునరేషన్ తీసుకునేదానినని ఆమె వెల్లడించారు. సెట్‌లో తనను చిరంజీవి కుమార్తెగా కాకుండా, కేవలం నిర్మాతగా మాత్రమే చూస్తారని ఆమె తెలిపారు.
చిరంజీవి, వెంకటేష్ మధ్య బలమైన బంధం సెట్‌లో కూడా కనిపించిందని, వారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని సుష్మిత కొణిదెల అన్నారు. వెంకటేష్ ప్రాజెక్టును వెంటనే అంగీకరించారు. వెంకటేశ్ రెమ్యునరేషన్ విషయంలో డిబేట్ ఏం జరగలేదు. ఈ సినిమాకు ఆయన పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన స్క్రీన్‌పై కనిపించిన దగ్గర నుంచి ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. ఆయన తీసుకున్న రెమ్యునరేషన్‌కు పూర్తి న్యాయం చేశారు . ఆయనకు ఎంత ఇవ్వాలన్నా మాకు ఆనందమే. వ్యక్తిగతంగానూ ఆయన చాలా పాజిటివ్‌గా ఉంటారు. తెలిపారు. వారిద్దరితో పూర్తి నిడివి సినిమా తీసే అవకాశం వస్తే అది చాలా అదృష్టమని అన్నారు. రామ్ చరణ్ తన దుస్తులపై వ్యక్తిగత శ్రద్ధ చూపుతారని, చిరంజీవి దుస్తులను తానూ ఎంపిక చేస్తానని, బహుమతులు కూడా ఇస్తానని పేర్కొన్నారు. ఇటీవల హిట్ అయిన “మీసాల పిల్ల” కాస్ట్యూమ్‌ను తాను వ్యక్తిగతంగా కొని బహుమతిగా ఇచ్చానని, అది సినిమాలో ఒక ఐకానిక్ లుక్‌గా మారిందని ఆమె గుర్తుచేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఈ సినిమా చూడలేదని, ఆయనకు చూపించడానికి ఎదురుచూస్తున్నామని సుష్మిత కొణిదెల తన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Premi Vishwanath: నేను మా ఆయన అందుకే కలిసి ఉండము.. కార్తీక దీపం ఫేమ్ వంటలక్క..