Producer Ms Raju : ప్రముఖ నిర్మాత ఇంట పెళ్ళిసందడి.. మూడు రోజులపాటు జరగనున్నపెళ్లివేడుక..

|

Feb 04, 2021 | 8:28 PM

టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది తారలు పెళ్లిపీటలెక్కారు మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. తాజాగా యంగ్ హీరో..

Producer Ms Raju : ప్రముఖ నిర్మాత ఇంట పెళ్ళిసందడి.. మూడు రోజులపాటు జరగనున్నపెళ్లివేడుక..
Follow us on

Producer Ms Raju : టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే కొంతమంది తారలు పెళ్లిపీటలెక్కారు మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. తాజాగా యంగ్ హీరో సుమంత్ అశ్విన్ కూడా ఓ ఇంటివాడవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బడా నిర్మాత ఎంఎస్ రాజు తనయుడిగా సుమంత్ అశ్విన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ‘కేరింత’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక సుమంత్ అశ్విన్ పెళ్లి పనులన్నీ తానే స్వయంగా చూసుకుంటానని చెప్పుకొచ్చారు ఎంఎస్ రాజు.

‘  కరోనా వైరస్ కారణంగా గతఏడాది అందరం ఎంతో సంక్లిష్టమైన జీవితాన్ని గడిపాం. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇలాంటి సమయంలో మా ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుండడం ఆనందంగా ఉంది. హైదరాబాద్ నగర శివారులోని మా ఫాం హౌజ్ లో ఈ వివాహ వేడుక జరగనుంది. తెలుగు సాంప్రదాయాల ప్రకారం మూడు రోజుల పాటు పెళ్లి వేడుక నిర్వహిస్తాం. ఈ వివాహానికి సంబంధించిన పనులన్నీ నేనే స్వయంగా చూసుకుంటున్నాను. ఇక ఈ పెళ్లి అతికొద్దిమంది బంధుమిత్రులు సన్నిహితులు సమక్షంలో జరుగుతుంది.’’ అని తెలిపారు ఎంఎస్ రాజు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Thalapathy Vijay: దళపతి విజయ్ మీదున్న వీరాభిమానంతో ఈ యువతి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..