తెలుగు చిత్రపరిశ్రమలో సోమవారం షూటింగ్స్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం ప్రకారం ఆగస్ట్ 1నుంచి చిత్రీకరణలు ఆగిపోయాయి. కానీ షూటింగ్స్ నిలిపివేతలో మాత్రం పాక్షిక ప్రభావం కనిపించింది. ఓవైపు బంద్ కొనసాగుతుండగా.. మరికొన్ని చిత్రాల షూటంగ్స్ యథావిధిగా కొనసాగాయి. దీంతో చిత్రపరిశ్రమలో షూటింగ్ ల విషయంలో గందరగోళం నెలకొంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ లోని కీలకమైన నిర్మాతల చిత్రాలే యథావిధిగా షూటింగ్స్ కొనసాగడం పై కొందరు ప్రొడ్యూసర్స్ అసహనం వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్స్ యథావిధిగా కొనసాగడం వివరణ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు.
నిర్మాణ వ్యయం, నటీనటుల పారితోషికాలు, వీపీఎఫ్ ఛార్జీలు, ఓటీటీ విడుదల వంటి సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు కొద్ది రోజుల పాటు షూటింగ్స్ నిలివేయనున్నట్లు ప్రొడ్యుసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే తమిళ్ స్టార్స్ ధనుష్, విజయ్ తలపతి నటిస్తోన్న సార్, వరిసు చిత్రాల షూటింగ్స్ యథావిధిగా జరగడంతో కొందరు నిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విజయ్, ధనుష్ నటిస్తోన్న సినిమాలు మాత్రమే షూటింగ్స్ జరిగాయి. తెలుగు చిత్రాల షూటింగ్స్ చేయడం లేదని నిర్మాత దిల్ రాజు తెలిపారు. తెలుగు చిత్రాల షూటింగ్స్ మాత్రమే నిలివేయాలని ఇతర భాషల సినిమాలు కాదని, ఇతర భాషా సినిమాల షూటింగ్స్ పై ఎలాంటి అభ్యంతరాలు వాణిజ్య మండలి అధ్యక్షుడు కె. బసిరెడ్డి తెలిపారు. మంగళవారం నిర్మాతల మండలి ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ జరగనుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.