కరోనా తెచ్చిన కష్టాల్లో చిక్కుకున్న పరిశ్రమంలో సినిమా ఇండస్ట్రీ ఒకటి. కరోనా దెబ్బకు షూటింగ్స్ ఆగిపోయి. ఎక్కడి షూటింగ్ లు అక్కడే ఆపేయడంతో సినీకార్మికులు చాలా నష్టపోయారు. ఆ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో ఇప్పుడొస్తున్న సినిమా టికెట్స్ ధరలను పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన బడా సినిమాలకు టికెట్ ధరలు పెంచే వెసులుబాటును కల్పించాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన మహేష్ సర్కారు వారి పాట సినిమా వరకు టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించాయి ప్రభుత్వాలు. అయితే పెంచిన ధరలు సామాన్యుల పై మాత్రం గట్టి ప్రభావమే చూపించాయని చెప్పాలి. పెరిగిన టికెట్స్ ధరల కారణంగా సామాన్యులు సినిమాలకు రావడం కష్టమయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో తమ సినిమాకు టికెట్ ధరలు పెంచబోమని తెలిపారు బడా నిర్మాత దిల్ రాజు.
దిల్ రాజు నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా మే 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. సునీల్ -సోనాల్ చౌహాన్ ఇందులో ముఖ్యమైన పాత్రలలో నటిస్తుండగా పూజా హెగ్డే స్పెషల్ నంబర్ యాడ్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మిస్తున్నారు. టీమ్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
మరిన్ని ఇక్కడ చదవండి :