Bandla Ganesh: అందుకే పవన్ కల్యాణ్ దారి నుంచి పక్కకు జరిగా.. బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆయన మాటల్లో పవన్ పై ఉన్న అభిమానం. ఆయన ఆవేశం లో పవన్ పై ఉన్న భక్తి స్పష్టంగా కనిపిస్తాయి. వేదిక ఏదైనా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిందే. అయితే అలాంటి బండ్లగణేష్ ఇప్పుడు పవన్ నుంచి దూరంగా వచేశారా..?

Bandla Ganesh: అందుకే పవన్ కల్యాణ్ దారి నుంచి పక్కకు జరిగా.. బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Bandla Ganesh

Updated on: Mar 21, 2023 | 3:51 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడిగా భావించే ఫ్యాన్స్‌లో అందరికంటే ముందుంటారు నిర్మాత బండ్ల గణేష్.. పవన్‌ను పొగడాలన్న.. అయన గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని చెప్పాలన్న బండ్ల గణేష్ తర్వాతే అని చెప్పాలి. ఆయన మాటల్లో పవన్ పై ఉన్న అభిమానం… ఆయన ఆవేశంలో పవన్ పై ఉన్న భక్తి స్పష్టంగా కనిపిస్తాయి. వేదిక ఏదైనా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిందే. అయితే అలాంటి బండ్లగణేష్ ఇప్పుడు పవన్ నుంచి దూరంగా వచేశారా..? ఇదేం పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా..? ఈ మధ్య సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇటు రామజకీయ నాయకుడిగా.. అటు నటుడిగా చాలా బిజీగా ఉన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రజల్లోకి వెళ్తుంటే పవన్‌కు మద్దతుగా చాలా మంది ఆయన వెంట నడుస్తున్నారు. అయితే ఈ విషయంలో బండ్లగణేష్ వెనకడుగు వేయడంతో ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి.

తాజాగా ఇలాంటి రూమర్స్ కు చెక్ పెట్టారు బండ్ల.. ఆయన పవన్ నుంచి ఎప్పుడు దూరంగా లేనని మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ లక్ష్యానికి అడ్డు వస్తానేమో అని కావాలనే పక్కకు వచ్చేశా అని అన్నారు. పవన్ నాకు ఎప్పటికీ దేవుడే.. కానీ మా అమ్మా నాన్నల కంటే ఆయనే ఎక్కువ .. నా భార్య బిడ్దల కంటే ఆయనే  ఎక్కువ అని అనలేను అన్నారు.

అంతరాత్మకి వ్యతిరేకంగా నేను ఏ పని చేయను.. ఆ దారిలో వెళ్ళాను. ఒక వ్యక్తిని కన్నవాళ్లకంటే .. భార్య బిడ్డలకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఎవరు చెప్పినా అది అబద్ధమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ముందున్న లక్ష్యం వేరు. అందువలన ఆయనకు అడ్డు రాకూడదని పక్కకి వచ్చేశాను.