సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరో రెమ్యునరేషన్‌లో సగం తిరిగి ఇచ్చేశాడు: నిర్మాత అనిల్ సుంకర

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సినిమాలు ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చేస్తారన్న విషయం తెలిసిందే. అలాగే ఓ హీరో కూడా సినిమాలు ఫ్లాప్ అయితే డిసిటీబ్యూటర్స్ ను ఆదుకోవడం కోసం తన రెమ్యునరేషన్ లో సగం తిరిగి ఇచ్చేశారని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు.

సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరో రెమ్యునరేషన్‌లో సగం తిరిగి ఇచ్చేశాడు: నిర్మాత అనిల్ సుంకర
Anil Sunkara

Updated on: Jan 10, 2026 | 8:38 PM

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తాజగా ఓ ఇంటర్వ్యూలో  తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలోని కొన్ని అంశాలు పంచుకున్నారు. తన వ్యక్తిగత వ్యాపారాల్లో ఒకటైన ‘రాజు గారి తోట బిర్యానీ’ ఆలోచన ఎలా పుట్టిందో అనిల్ సుంకర వివరించారు. విజయవాడ వెళ్లేటప్పుడు ఉదయం 4 గంటలకే బయలుదేరి వెళ్లి, తిరుగు ప్రయాణంలో ఒకటిన్నర గంట ఆ బిర్యానీ సెంటర్‌లో గడుపుతానని తెలిపారు అనిల్ సుంకర. సినీ పరిశ్రమలో హీరోలతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ.. తాను పనిచేసిన హీరోలందరూ తనకు ఆత్మీయులేనని పేర్కొన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు తనకు, తన కుటుంబానికి చాలా సన్నిహితుడని, తమ మధ్య నో ఫిల్టర్ టాక్స్” ఉంటాయని తెలిపారు అనిల్. మహేష్ బాబు చెప్పే జోకులు చాలా నవ్వు తెప్పిస్తాయని, తనతో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతామని సుంకర అన్నారు.

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్

సినిమా విజయం, అపజయాలతో సంబంధం లేకుండా, తన సినిమా బాగోకపోయినా మహేష్ బాబు తనకు కాల్ చేసి మద్దతు ఇస్తారని, ఇది తనకెంతో ధైర్యాన్నిస్తుందని అన్నారు అనిల్. మహేష్ యూఎస్‌కు వచ్చినప్పుడు, ముఖ్యంగా గౌతమ్( మహేష్ బాబు కొడుకు) అక్కడ చదువుతున్నందున, తరచూ కలుస్తుంటామని తెలిపారు. అదేవిధంగా ఫ్లాప్ వచ్చినా హీరోలకు, పెద్ద దర్శకులకు అవకాశాలు ఉంటాయని, ఇది సప్లై అండ్ డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని అనిల్ సుంకర స్పష్టం చేశారు.

13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..

దూకుడు తర్వాత శ్రీను వైట్లకు ఎలా అవకాశాలు వచ్చాయో, అలాగే ఆగడు తర్వాత కూడా మహేష్ బాబు ఐదు, ఆరు సినిమాలు చేశారని గుర్తు చేశారు. అలాగే తెలుగు హీరోలు తమిళ హీరోల కంటే మెరుగైనవారని, వారి రెమ్యూనరేషన్లు తక్కువని పేర్కొన్నారు, మన చిత్రాలకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నప్పటికీ. 100-150 కోట్లు తీసుకునే హీరోలు ఐదుగురు వరకు ఉన్నారని, వారు కూడా 500 కోట్ల భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే అంత తీసుకుంటున్నారని తెలిపారు. చాలా మంది హీరోలు సినిమా విజయం కోసం త్యాగాలు చేస్తారని, హిట్ అయితే రెమ్యూనరేషన్ గురించి ఎవరూ పట్టించుకోరని అన్నారు. 1 – నేనొక్కడినే, ఆగడు చిత్రాల తర్వాత మహేష్ బాబు, నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు వారికి అండగా నిలిచారని అనిల్ సుంకర అన్నారు. ముఖ్యంగా ఆగడు చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, మహేష్ బాబు తన రెమ్యూనరేషన్‌లో కొంత భాగాన్ని తిరిగి ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లకు సహకరించారని చెప్పారు. సర్లేరు నీకెవ్వరు చిత్రానికి సైతం రెమ్యూనరేషన్ ఆరు నెలల తర్వాత, సినిమా విడుదలయ్యాక, కోవిడ్ సమయంలో వసూళ్లు మందగించినప్పుడు తిరిగి ఇచ్చారని అనిల్ అన్నారు.

వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.