Bigg Boss Telugu 7: బిగ్ బాస్ బిగ్ టాస్క్.. అమర్ దీప్ గుండు.. ప్రియాంక బేబి కటింగ్.. కానీ

|

Sep 22, 2023 | 7:15 AM

హౌస్ లో ఉన్న వారిలో ఎవరో ఒకరు ఈ టాస్క్ చేయాలి. బిగ్ బాస్  మొదటి సీజన్ లో ఎవ్వరూ ఈ సాహసం చేయలేదు కానీ ఆతర్వాత నుంచి ఒకొక్కరిగా జుట్టు కత్తిరించుకోవడం చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హోస్ లోకి వచ్చినవారిలో..దీప్తి సునైనా, శివజ్యోతి, దేత్తడి హారిక, అమ్మా రాజశేఖర్, వాసంతి జుట్టు కత్తిరించుకున్నారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 లో ఎవరు ఈ త్యాగం చేశారంటే..

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ బిగ్ టాస్క్.. అమర్ దీప్ గుండు.. ప్రియాంక బేబి కటింగ్.. కానీ
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్ బాస్ సీజన్స్ లో కొన్ని టాస్క్ లు నిజాంగా దారుణంగా ఉంటాయి వాటిలో జుట్టు కత్తిరించుకోవడం కూడా ఒకటి అమ్మాయిలకు జుట్టు పెంచుకోవచడం పెద్ద జెడ వేసుకోవడం అనే మహా సరదా.. కానీ బిగ్ బాస్ లో మాత్రం టాస్క్ లో భాగంగా జుట్టును కత్తిరించుకోవాల్సి ఉంటుంది. హౌస్ లో ఉన్న వారిలో ఎవరో ఒకరు ఈ టాస్క్ చేయాలి. బిగ్ బాస్  మొదటి సీజన్ లో ఎవ్వరూ ఈ సాహసం చేయలేదు కానీ ఆతర్వాత నుంచి ఒకొక్కరిగా జుట్టు కత్తిరించుకోవడం చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హోస్ లోకి వచ్చినవారిలో..దీప్తి సునైనా, శివజ్యోతి, దేత్తడి హారిక, అమ్మా రాజశేఖర్, వాసంతి జుట్టు కత్తిరించుకున్నారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 లో ఎవరు ఈ త్యాగం చేశారంటే..

బిగ్ బాస్ 7 హౌస్ లో ప్రస్తుతం 12 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. త్వరలోనే కొంతమంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 21 మందితో బిగ్ బాస్ గేమ్ షో ఉంటుంది. కానీ ఈసారి ముందుగా 14 మందిని పంపించి ఆతర్వాత మిగిలిన వారిని హౌస్ లోకి పంపనున్నారు. ఇక ఉన్న 14 మందిలో ఇప్పటికే ఇద్దరు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. కిరణ్ రథోడ్ , షకీలా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.

ఇక ఈ వారం కూడా ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చేలా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక ఈ సీజన్ లో జుట్టుకత్తిరించుకుంది మన ప్రియాంక జైన్. జానకి కలగనలేదా సీరియల్ తో పాపులర్ అయిన ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో అందరిని ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ పవర్ అస్త్ర కంటెండర్ గా ఉండాలంటే అమర్ దీప్, ప్రియాంకా జుట్టును త్యాగం చేయాలనీ అన్నారు. అమర్ దీప్ ఏకంగా గుండు కొట్టించుకోవాలని, పప్రియాంక బేబీ కటింగ్ చేయించుకోవాలని అన్నారు బిగ్ బాస్. దాంతో అమర్ దీప్ నా వల్ల కాదు అంటూ చేతులెత్తేశాడు. నా తల పై కుట్లు ఉన్నాయి. గుండు చేయించుకుంటే కనిపిస్తాయి. నేను చేయించుకోనూ.. నేను రవితేజ గారికి పెద్ద ఫ్యాన్స్ ని ఆయన నా  తల పై చేయి వేసి నా జుట్టులానే ఉంది అన్నారు. అలాంటి నా జుట్టును కత్తిరించుకోమంటారా..? అంటూ రకరకాల కారణాలు చెప్పాడు. కానీ ప్రియనక మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఒకే చెప్పి బేబీ కటింగ్ చేయించుకుంది. ఆతర్వాత నాకు జుట్టు కత్తిరించుకోవడం ఇష్టం లేదు అని కానీ అమర్ నో అన్నాడని నేను ముందుకు వచ్చాను అని.. ఆతర్వాత నాకు ఇలాంటి కటింగ్ అంటే ఇష్టం అని నేను ఎప్పటి నుంచో చేయించుకోవాలని చూస్తున్నా అని మరికాసేపు చెప్పుకొచ్చింది ప్రియాంక. ఆతర్వాత తన కొత్త లుక్ చూసుకొని తెగ మురిసిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.