
భారతీయ సినిమా ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. చిన్న వయసులోనే సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మరో ప్రాజెక్ట్ చేస్తుంది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. తాను పనిచేసిన హీరోలందరితో డేటింగ్ చేశానని.. తాను కోరుకున్న రిలేషన్ షిప్ గురించి వెయిట్ చేసినట్లు తెలిపింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? తనే హీరోయిన్ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి వారణాసి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇందులో మందాకిని పాత్రలో కనిపించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
గతంలో అలెక్స్ కూపర్ పాడ్‌కాస్ట్ కాల్ హర్ డాడీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. తాను పనిచేసిన హీరోలతో డేటింగ్ చేశానని వెల్లడించింది. “నేను నాతో పనిచేసిన నటులతో డేటింగ్ చేశాను. కానీ ఎప్పుడూ ఒకే బంధంతో సాగలేదు. ఒక సంబంధం నుంచి మరొక సంబంధానికి మారాను. చివరి సంబంధం వరకు సంబంధాల మధ్య నేను అస్సలు సమయం కేటాయించలేదు. ఎప్పుడు నా సెట్‌లో కలిసిన నటులతో డేటింగ్ చేశాను. సంబంధం ఎలా ఉండాలో నాకు ఒక ఆలోచన ఉందని నేను అనుకున్నాను. అలాంటి బంధం కోసమే వెతికాను. నా జీవితంలోకి వచ్చే వ్యక్తుల ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. చాలా మంది గొప్ప నటులతో డేటింగ్ చేశాను. కొన్ని సంబంధాలు దారుణంగా ముగిశాయి. కానీ నా భర్త కంటే ముందు నా చివరి డేటింగ్ బ్రేకప్ తర్వాత దాదాపు 2 సంవత్సరాలు మరో ప్రేమకు దూరంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అమెరికా సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియాంక.. ఆ తర్వాత హాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడే పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న వారణాసి సినిమాలో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..