Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మళ్లీ సినిమాల్లోకి ఒకప్పటి టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

ఒకప్పుడు స్టార్ హీరోలు, హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన వారందరూ మళ్లీ సినిమాల్లోకి ఇస్తున్నారు. సహాయక నటులుగా సెకెండ్ ఇన్నింగ్స్ లు షురూ చేస్తున్నారు. అలా తాజాగా మరో హీరో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడిగా క్రేజ్ తెచ్చుకున్న అతను చాలా ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నాడు.

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మళ్లీ సినిమాల్లోకి ఒకప్పటి టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Premadesam Movie Hero Abbas

Updated on: Dec 21, 2025 | 8:19 AM

లయ, మన్మథుడు అన్షు, జెనీలియా, కామ్న జెఠ్మాలానీ, నందమూరి కల్యాణ్ చక్రవర్తి.. ఇలా ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ తారలు కెమెరా ముందుకు వచ్చారు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వీరు మళ్లీ ఇప్పుడు సహాయక నటులుగా మారి ఆడియెన్స్ ను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో టాలీవుడ్ హీరో కూడా చేరాడు. ఈ నటుడు ఒకప్పుడు లవర్ బాయ్. తన నటనతో తెలుగు యువత హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఇక అమ్మాయిలకు అయితే కలల రాకుమారుడు. ఈ హ్యాండ్సమ్ హీరో అంటే పడి చచ్చే అమ్మాయిలు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్టార్ హీరోగా వెలిగిన అతను సడెన్ గా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ వెళ్లిపోయి అక్కడే స్థిర పడ్డాడు. చాలా ఏళ్ల పాటు అక్కడే వివిధ ఉద్యోగాలు చేసిన అతను మళ్లీ ఇప్పుడు ఇండియా తిరిగి వచ్చాడు. సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన అతను ఇప్పుడు సహాయక నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా అతని సినిమాకు సంబంధించి ఒక కీ అప్డేట్ వచ్చింది. సినిమాకు సంబంధించి రీఎంట్రీ హీరో పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు మేకర్స్. పై ఫొటో అదే. మరి అందులో ఉన్నదెవరో చాలా మంది గుర్తు పట్టేసి ఉంటారు.

 

ప్రేమ దేశం సినిమాతో దేశవ్యాప్తంగాగుర్తింపు తెచ్చుకున్న అబ్బాస్ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. ‘హ్యాపీ రాజ్’ అనే సినిమాతో ఆయన మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అబ్బాస్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తుండగా, గీతా కైలాసం, జార్జ్ మరియన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక గ్లింప్స్ న మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అబ్బాస్ లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరియా రాజా ఎలాంచెళియన్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జైవర్ధ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత అబ్బాస్‌ను మళ్లీ తెరపై చూసేందుకు ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హ్యాపీ రాజ్ సినిమాలో అబ్బాస్ లుక్..

హ్యాపీ రాజ్ సినిమా ప్రోమో..