Salaar Movie : ‘ప్రభాస్ ఒక సింహం’.. సలార్‌‌‌లో దేవా క్యారెక్టర్ గురించి హింట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఆఫ్ లైన్ టికెట్స్ కోసం అభిమానులు భారీగా క్యూ లైన్ లో నిలబడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే రెస్పాన్స్ వస్తుంది. అలాగే విదేశాల్లోనూ రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

Salaar Movie : ప్రభాస్ ఒక సింహం.. సలార్‌‌‌లో దేవా క్యారెక్టర్ గురించి హింట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Salaar Movie

Updated on: Dec 20, 2023 | 3:48 PM

ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే టికెట్స్ ఓపెన్ కావడంతో థియేటర్స్ అన్ని ఫుల్ అయ్యిపోయాయి. సలార్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఆఫ్ లైన్ టికెట్స్ కోసం అభిమానులు భారీగా క్యూ లైన్ లో నిలబడుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే రెస్పాన్స్ వస్తుంది. అలాగే విదేశాల్లోనూ రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. సలార్ సినిమాతో ప్రభాస్ నయా రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు.

ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ప్రభాస్ పాత్ర ఎలా డిజైన్ చేశారు అన్నదాని పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే సలార్ సినిమాలో ప్రభాస్ పాత్ర పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. సాలార్ సినిమా ఇద్దరు మిత్రుల మధ్య జరుగుతుందని ఇప్పటికే చెప్పాడు ప్రశాంత్.. ఇద్దరు ప్రాణ మిత్రులు, బద్ద శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో చూస్తారు అని హింట్ ఇచ్చాడు.

ఇక ఇప్పుడు ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ.. దేవా పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాగే దేవా మొఖంలో ఓ అమాయకత్వం.. క్యారెక్టర్ లో ఓ పసి తనం కనిపిస్తుంది. అలాగే మరో కోణం కూడా ఉంటుంది. కోపం వస్తే అతని ముఖంలో ఓ సింహం కనిపిస్తుంది. అవసరం అయితే ఎదుటివారి కాళ్లు పట్టుకుంటాడు.. లేదంటే తల నరుకుతాడు అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా సాలార్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. సలార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బాబీ సింహ, శ్రియ రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.