ప్రణీతకు క్రేజీ ఆఫర్ ! ​

హీరోయిన్ ప్రణీతా సుభాష్​‌కు మరో లక్కీ ఛాన్స్ దక్కిినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ అమ్మడికి మరోసారి పవర్​స్టార్ పక్కన డ్యాన్స్ చేసే అదృష్టం దక్కిందట.

ప్రణీతకు క్రేజీ ఆఫర్ ! ​

Updated on: Nov 02, 2020 | 9:11 PM

హీరోయిన్ ప్రణీతా సుభాష్​‌కు మరో లక్కీ ఛాన్స్ దక్కిినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ అమ్మడికి మరోసారి పవర్​స్టార్ పక్కన డ్యాన్స్ చేసే అదృష్టం దక్కిందట. ​ పవన్​ కల్యాణ్​, టాలెంటెడ్​ డైరెక్టర్​ క్రిష్ కాంబినేషన్​లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. పీరియాడికల్​ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇందులో ఓ ప్రత్యేక గీతం ఉందని సమాచారం. దానికోసం నటి ప్రణీతా సుభాష్​ను మూవీ యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో ప్రణీత పవన్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.  కాగా క్రిష్ సినిమాలో పవన్ రాబిన్​ హుడ్​ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్​ను పరిశీలిస్తుంది యూనిట్. ఏఎమ్​ రత్నం భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్​​ ప్రస్తుతం ‘వకీల్​సాబ్​’ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :

సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగింపు

దారుణం..జన్మనిచ్చిన అమ్మనే సజీవ దహనం చేసిన కొడుకు