Salaar Movie: బాక్సాఫీస్ వద్ద ‘సలార్’ ఊచకోత.. రూ.500 క్లబ్‏లోకి ప్రభాస్ సినిమా.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ సినిమాలో డార్లింగ్ మాస్ విశ్వరూపం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సలార్ సినిమాపై అటు విమర్శకుల ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఊహించని రేంజ్‏లో రెస్పాన్స్ వస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇప్పుడు విజయవంతంగా దూసుకుపోతుంది ఈ సినిమా. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సలార్ సినిమా రూ. 500 కోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ ప్రకటించింది.

Salaar Movie: బాక్సాఫీస్ వద్ద సలార్ ఊచకోత.. రూ.500 క్లబ్‏లోకి ప్రభాస్ సినిమా.
Salaar Movie

Updated on: Dec 28, 2023 | 1:40 PM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలుకొడుతున్న సినిమా ‘సలార్’. ఈఏడాదిలోనే అధికంగా ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇది. కేజీఎఫ్ 1, 2 తర్వాత సలార్ సినిమాతో మరోసారి సెన్సెషన్ సృష్టించాడు డైరెక్టర్ నీల్. మరోవైపు బాహుబలి తర్వాత దాదాపు నాలుగేళ్లకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ సినిమాలో డార్లింగ్ మాస్ విశ్వరూపం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సలార్ సినిమాపై అటు విమర్శకుల ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఊహించని రేంజ్‏లో రెస్పాన్స్ వస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇప్పుడు విజయవంతంగా దూసుకుపోతుంది ఈ సినిమా. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సలార్ సినిమా రూ. 500 కోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ ప్రకటించింది.

బాక్సాఫీస్ రికార్డులను దేవ రిపేర్ చేస్తున్నాడంటూ రాసుకొచ్చింది సలార్ టీం. మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.177 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది సలార్. కేవలం మన దేశంలోనే రూ.95 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. ఇక రెండో రోజు వరల్డ్ వైడ్ దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మూడో రోజు ఏకంగా రూ.400 కోట్ల మార్క్ దాటేసింది. ఇక ఇప్పుడు మొత్తం ఆరు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ ను క్రాస్ చేసిందని వెల్లడించారు మేకర్స్. ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి కాకుండానే రూ. 500 కోట్ల మార్క్ అందుకుంది. ఇక త్వరలోనే రూ. 1000 కోట్లు రాబట్టడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‏తో నిర్మించింది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.