Salaar Movie: కౌంట్ డౌన్ స్టార్ట్.. మార్కెట్లోకి ‘సలార్’ షర్ట్స్.. ధరెంత ఉందో తెలుసా ?..

భారీ బడ్జెట్‏తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ వచ్చే నెల అంటే డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వరల్డ్ వైడ్ సలార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఓవైపు సోషల్ మీడియాలో సలార్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

Salaar Movie: కౌంట్ డౌన్ స్టార్ట్..  మార్కెట్లోకి సలార్ షర్ట్స్.. ధరెంత ఉందో తెలుసా ?..
Salaar Movie

Updated on: Nov 26, 2023 | 11:46 AM

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ మాస్ హీరోగా కనిపించనున్నారు. దీంతో ఈ మూవీని చూసేందుకు అడియన్స్ తెగ ఆరాటపడుతున్నారు. భారీ బడ్జెట్‏తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ వచ్చే నెల అంటే డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వరల్డ్ వైడ్ సలార్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఓవైపు సోషల్ మీడియాలో సలార్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

ఇదిలా ఉంటే.. సలార్ సినిమా కోసం త్వరలోనే ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారట హోంబలే ఫిల్మ్స్. అటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయని.. అలాగే అన్ని భాషల మీడియాతో ప్రభాస్ ఇంట్రాక్ట్ కానున్నాడని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటు సలార్ ప్రమోషన్స్ షూరు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో సలార్ టీ షర్ట్స్ సందడి చేస్తున్నాయి. ప్రభాస్ అభిమానుల కోసం ఆన్ లైన్ లో వీటిని విక్రయిస్తున్నారు. హోంబలే వెర్సెస్ (hombaleverse) వెబ్ సైట్లో ఈ షర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. టీషర్ట్, హూడీ, హార్మ్ స్లీవ్స్ కొనుగోలు చేయవచ్చు. టీషర్ట్స్ కావాలనుకున్న ఫ్యాన్స్ హోంబలే వెర్సెస్ వెబ్ సైట్ లో కొనుగోలు చేయవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..రూ.499 నుంచి ప్రారంభమై రూ.1499 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ మాస్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను రెండు భాగాలుగా తీసువస్తున్నారు. గతంలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన కేజీఎఫ్ చిత్రానికి సలార్ మూవీకి లింక్ ఉంటుందని అంటున్నారు ప్రేక్షకులు. డిసెంబర్ 22న ఈ సినిమా షారుఖ్ నటించిన డుంకీ సినిమాతో పోటీ పడబోతుంది. ఈ క్రమంలోనే సలార్ ప్రమోషన్స్ సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.