నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. కల్కి సినిమాలో వాడిన గ్రాఫిక్స్‌కు విశేష ఆదరణ లభించింది. కొత్త ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా రెండో రోజు (జూన్ 28) కూడా భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో చిత్రబృందం సంతోషంలో తేలిపోతుంది.
తొలిరోజు ‘కల్కి 2898 AD’ ప్రపంచ వ్యాప్తంగా రూ.191 కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ లెక్కను కలుపుకుంటే, సినిమా మొత్తం వసూళ్లు దాదాపు రూ. 300 కోట్ల రూపాయలకు చేరువలో ఉన్నాయి. రెండో రోజులకు కలిపి కల్కి సినిమా రూ. 298.5 కోట్లు వసూల్ చేసింది. ఈ మేరకు మూవీ టీమ్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.
‘కల్కి 2898 AD’ చిత్రం మహాభారతం చుట్టూ తిరుగుతుంది. కథ మహాభారతం నుండి మొదలై 2898 AD వరకు సాగుతుంది. సినిమాలో నాగ్ అశ్విన్ సృష్టించిన కాశీ అనే మాయా ప్రపంచం అందరి దృష్టిని ఆకర్షించింది. ‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు నటించారు. అలాగే టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఈ సినిమాలో అతిథి పాత్రలు చేశారు. నేడు శనివారం (జూన్ 29), రేపు (జూన్ 30) సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా వెయ్యి కోట్లు వసూల్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
Hearing this from you is truly incredible 🤩
Thank you for boosting our zeal 😊Wishing for a heat wave to rise this winter with Kanguva sir! 🔥#Kalki2898AD https://t.co/LP8duHyR84
— Kalki 2898 AD (@Kalki2898AD) June 29, 2024
The love is pouring in from all corners of the world! ❤️🔥#Kalki2898AD #EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/o2v5mfOiUN
— Kalki 2898 AD (@Kalki2898AD) June 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.